వడగళ్లు- పిడుగులు, మరో నాలుగు రోజులు భారీ వర్షాలు: ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
ఎండవేడితో అల్లాడిపోతున్న జనాన్ని పలకరిస్తూ అకాల వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, నైరుతి గాలుల ప్రభావంతో అటు ఏపీ, ఇటు తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వర్షాలతోపాటు పిడుగులు పడతాయంటూ వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
వర్షాలు కురుస్తుండటంతో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ వర్షాలపై, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు వడగళ్ల వానలతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడవద్దని సూచిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు దంచికొడుతు న్నాయి. రానున్న గంటల్లో సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్‌కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో గాలివానల వల్ల చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.













Click it and Unblock the Notifications