Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రుతుపవనాలు వచ్చేది ఎప్పుడంటే - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!

ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో వర్షాల కోసం వేచి చూస్తున్న సమయంలో రుతుపవనాల రాక పైన తాజా సమాచారం అందుతోంది. జూన్‌ 8, 9వ తేదీల్లో రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలపైన వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

భారీ వర్షాలు కురిసే ఛాన్స్:ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఇదే సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి. వడగాల్పులు కొన్ని జిల్లాల్లో ఇబ్బంది పెడుతుంటే ఈదురు గాలులతో మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు అల్లూరి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అనకాపల్లి, కృష్ణ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది.

IMD Predicts chances for Heavy rains in Coastal discricts for next two days, Monsoon may reach on June 8th

రుతుపవనాల రాకపై:కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం వల్ల వాతావరణం కాస్త చల్లబడగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రుతుపవనాల గమనాన్ని వాతావరణ శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం జూన్‌ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.

జూన్ తొలి వారంలో ప్రవేశం:జూన్ 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయవ్య దిశగా పయనించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కేరళకు రుతుపవనాలు రాకకు ఇబ్బంది లేకపోయినా పురోగతిలో మందకొడితనం కనిపించే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేరళ పరిసరాల్లో వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రంలో నైరుతి గాలుల వేగం పెరగడంతో జూన్‌ రెండు, మూడు తేదీల్లోనే రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశముందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అల్పపీడనం బలపడి తుఫానగా మారితే రుతుపవనాల విస్తరణపై ప్రభావం చూపనుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న తరువాత జూన్‌ 8, 9వ తేదీల్లో రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+