మళ్లీ మొదలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ముందస్తుగానే వచ్చిన రుతుపవనాలు మందగించ టం తో ఉక్కపోత పెరిగింది. వరుసగా వారం రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. కాగా, ఇప్పుడు రుతుపవనాల్లో తిరిగి వేగం..బంగాళాఖాతంలో ఆవర్తనం ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీతో పాటుగా, తెలంగాణలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది.
ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు (సోమవారం) తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఏపీలో రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

తెలంగాణలోని సిద్దిపేట, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ రోజు తెలంగాణలోని నల్లగొండలో గరిష్టంగా 38.5, మహబూబ్‌నగర్‌లో కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బుధవారం కూడా ఏపీలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో, ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications