నైరుతి రాక, తుఫాను - పలు ప్రాంతాల్లో వర్షాలు..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలు ఎక్కువై జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ ఉక్కపోత పెరిగింది. అరేబియా సముద్రంలో బిపర్జాయ్ తుఫాను ఏర్పడింది. ఇటు ఈశాన్య రుతుపవనాలు రేపు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
భారీ ఉష్ణోగ్రతలతో: ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్రమైన ఎండ, వడగాల్పులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఏలూరు జిల్లా కామవరపు కోటలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొప్పురపాడులో 44.6, చిల్లకల్లు, పెనుగంచిప్రోలులో 44.3, కురిచేడు, జంగమహేశ్వర పురంలో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

ఏపీలోపలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వాతావరంణలో మార్పు కనిపిస్తోంది. ఈ ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
తేలికపాటి నుంచి మోస్తరు వానలు: అటు తెలంగాణలో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురియనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కిందిస్థాయి గాలుల ప్రభావంతో ఎండలు ఎక్కువై జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర తుఫానుగా మారిన బిపార్జోయ్ తుఫాను వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తుఫాను..రుతుపవనాలు: జూన్ 4న రుతుపవనాలు వస్తాయని మేలో ఐఎండీ అంచనా వేసింది. కానీ ఇది కాస్త ఆలస్యమైంది. తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో జూన్ 9 వరకు, కేరళలో జూన్ 11 వరకు కొనసాగుతుందని, జూన్ 9-11 వరకు లక్షదీప్, జూన్ 10, 11 తేదీల్లో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 17 లేదా 18 తేదీల్లో రుతు పవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. కేరళ, తమిళనాడు, లక్షదీప్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా చెల్లాచెదురుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications