వాయుగుండం, అలర్ట్ కావాల్సిందే - వర్షాలపై లేటెస్ట్ అప్డేట్..!!
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనానికి తోడు రేపు ఇంకో ద్రోణి ఏర్పడుతుందని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 28వ తేదీ వరకు భారీ వర్షాలు తప్పవని అంచనా వేసింది. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజి 16 గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేసారు. దీంతో మరో అయిదు రోజుల అప్రమత్తత తప్పదని స్పష్టం చేస్తోంది.
వాయుంగుండంగా మారే ఛాన్స్: వాయువ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో 24న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా ఆనుకుని పశ్చిమ ధ్య, దానికి ఆనకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుంది. తరువాతర రెండు రోజుల్లో అది బలపడి వాయుగుండంగా మారుతుందని అంచనా వేసారు.

శనివారం కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో పలు చోట్ భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని..కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 28వరకు రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అయిదు రోజులు అప్రమత్తం: అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉందని, సముద్రంలో వాతావరణం అస్సలు అనుకూలంగా లేదంటోంది వాతావరణశాఖ. తీరం వెంబటి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎట్టిపరిస్థితుల్లో మరో నాలుగు రోజులు సముద్రంలో వేటకెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది.
తెలంగాణలో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవొచ్చని చెప్పింది.

గోదావరి పరవళ్లతో అలర్ట్: గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం వద్ద ఆదివారం నుంచి గోదావరి వరద పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వరద తగ్గే వరకు పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు క్రిష్ణా నదిలో వరద పెరిగింది.
విజయవాడలో ప్రకాశం బ్యారేజి వద్ద 16 గేట్లను అడుగు మేరకు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో...రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల కలెక్టర్లను అలర్ట్ చేసాయి. మరో అయిదు రోజులు భారీ వర్షాల హెచ్చరికలతో ముందస్తు చర్యలు ప్రారంభించాయి.












Click it and Unblock the Notifications