నెక్ట్స్ 12 గంటలు బీ అలెర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులు.. ఈదురుగాలులతో వర్షాలు.. IMD హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రానున్న మూడు రోజులుపాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలతో పాటు పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

రాబోయే 12 గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తరం వైపు కదులుతోందని.. రాగల 36 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గంటకు 40-50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

IMD Warns Telugu States of Arabian Sea Low-Pressure System

మే 22న రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపారు. ఇక మే 23న అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అంతేకాక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

ఇక దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాలు కూడా అతి భారీ వర్షాలను ఎదుర్కొంటోన్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలు సంభవిస్తున్నాయి. కాశ్మీర్ నుంచి మధ్యప్రదేశ్ వరకూ వర్షాలు భారీగా పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+