• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కు షర్మిల రాఖీ విషెస్ - అనూహ్యంగా..!!

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన సోదరుడు..ఏపీ సీఎం జగన్ కు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేసారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు సమయ నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. దీని పైన రాజకీయంగా అనేక రకాలుగా చర్చలు జరిగాయి. అప్పటి నుంచి ఇడుపులపాయ కేంద్రంగా వైఎస్సార్ జన్మదినం...వర్ధంతి నాడు మాత్రమే అన్నా - చెల్లెలు ఇద్దరూ ఎదురు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కలిసి పలకరింపులు చోటు చేసుకుంటున్నాయి.

Recommended Video

జగన్ కి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు, మంత్రులు *AndhraPradesh | Telugu OneIndia

సుదీర్ఘ విరామం తరువాత షర్మిల విషెస్


పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదనేది తమ జగన్ విధాన పరమైన నిర్ణయంగా ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల అప్పట్లోనే స్పష్టం చేసారు. ఇక, ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయలే కానీ..అభిప్రాయ బేధాలు లేవని వివరించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని షర్మిల పార్టీ ఏర్పాటు జరిగి ఏడాది పూర్తయింది. ప్రస్తుతం పాదయాత్రలో బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన వైసీపీ ప్లీనరీలో సైతం తల్లి విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవిని వీడుతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు ఏపీలో సీఎంగా ఉన్నారని.. కుమార్తె కష్టాల్లో ఉండటంతో ఈ సమయంలో కుమార్తెను అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

కొత్త పార్టీ ఏర్పాటుతో గ్యాప్

కొత్త పార్టీ ఏర్పాటుతో గ్యాప్


దీంతో..రెండు రాష్ట్రాలు - భిన్న పార్టీల నడుమ వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే వేదిక నుంచి వైఎస్సార్ మరణం తరువాత తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు..జగన్ పైన అక్రమంగా కేసులు నమోదు చేసిన అంశంతో పాటుగా షర్మిల పాదయాత్ర.. ఉప ఎన్నికల్లో ఏకంగా 15 స్థానాల్లో విజయం సాధించిన తీరు వివరించారు. ఇక, షర్మిల వైఎస్సార్టీపీ అధినేత్రిగా వచ్చే ఎన్నికల్లో షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. అయితే, షర్మిల తెలంగాణలో తన పొలిటికల్ ఎంట్రీ ప్రకటన సమయంలో తాను పార్టీ ఏర్పాటు ఇష్టం ఉన్నా లేకున్నా..ఈ జన్మకు ఆయనే తన అన్న అని ఉద్వేగంగా చెప్పారు.

తోడబుట్టిన అన్నకు రాఖీ శుభాకాంక్షలు

తోడబుట్టిన అన్నకు రాఖీ శుభాకాంక్షలు


రాఖీ నాడు తన అన్నకు రాఖీ కడుతా..శుభాకాంక్షలు చెబుతా అవన్నీ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ రోజు రాఖీ కావటంతో షర్మిల ట్విట్టర్ ద్వారా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల తన ట్వీట్ లో.. నా తోడబుట్టిన అన్నతోపాటు నా ఈ ప్రజాప్రస్థాన పాదయాత్రలో 1600 కిలోమీటర్ల పైగా నాతో నడిచి, నాకు దేవుడిచ్చిన తోబుట్టువుల్లా రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు...అంటూ పోస్టు చేసారు. మహా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల..తన తోడ బుట్టిన అన్నకు .. అదే సమయంలో తనకు తోడుగా నిలిచిన ప్రతీ సోదరుడికి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ అటు వైస్పార్టీపీలో..వైసీపీలో వైరల్ అవుతోంది.

English summary
YS Sharmila conveyss Rakhi wishes to AP Cm and her brother YS Jagan, This tweet now became viral in both parties
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X