ఎన్నికల వేళ కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..!!
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి కీలక సమాచారం అందింది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది. ఈ ఏడాది పాలనా పరంగా ఏపీ ప్రభుత్వాని కి కీలక సమయం. సంక్షేమ పథకాల అమలుతో పాటుగా పలు హామీలను అమలు చేయాల్సిన సమయం. ఈ సమయంలో కొత్త ఆర్దిక సంవత్సరంలో ఆర్దికంగా తోడ్పాటు గురించి కేంద్రంతో ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు కేంద్రం అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
రూ 30,275 కోట్లకు అనుమతులు:ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఏపీకి రూ 30,275 కోట్ల మేర రుణాలకు అనుమతులు లభించాయి. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్దిక శాఖో పాటుగా రిజర్వు బ్యాంకు అధికారులకు వర్తమానం పంపారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఆమోదం లభించకపోయినా, ఏపీ ప్రభుత్వానికి ఈ నిర్ణయం రిలీఫ్ ఇవ్వనుంది. ఈ నెలలో ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి అరియర్స్ క్లియర్ చేయటం పైన గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. జీతాలు క్లియర్ అవుతున్నా.. ఇంకా పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్దికంగా ఉన్న ఒత్తిడి సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

వచ్చే వారం మరో రూ 3,500 కోట్లు:223-24 ఆర్దిక సంవత్సరంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి రూ 30,275 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏప్రిల్ లో అడహక్ అనుమతులతో రూ 6,000 కోట్ల రుణం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఆర్దిక సంవత్సరంలో అంతా కలిపి రూ 24,275 కోట్ల రుణాలకు అనుమతి ఉందని తేల్చి చెప్పింది. వచ్చే మంగళవారం రూ 3,500 కోట్ల రుణాలు సమీకరణకు రిజర్వ్ బ్యాంకుకు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. తాజా అనుమతులతో ఏ నెలలో ఎప్పుడు ఎంత రుణం కావాలో రాష్ట్ర అధికారులు ఇండికేటివ్ క్యాలెండర్ సిద్దం చేసి రిజర్వ్ బ్యాంకుకు పంపనున్నారు. ప్రస్తుతం రుణాలకు అనుమతి లభించటంతో ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు వినియోగించుకుంటున్నారు.
ఎన్నికల ఏడాదిలో కీలకంగా:మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. పాలనా పరంగా అమలు చేయాల్సిన నిర్ణయాలకు ఇది కీలక సమయం. ఆర్దికంగా ఎన్ని సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఉద్యోగుల బకాయిల చెల్లింపులతో పాటుగా ఇతరత్రా చెల్లింపుల ఒత్తిడి ప్రభుత్వం పైన కొనసాగుతోంది. ఈ ఏడాది సంక్షేమ పథకాల భారం గత ఏడాది కంటే పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పాటుగా అప్పుల సమీకరణ ద్వారా వీటిని పూర్తి చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఎన్నికల వేళ క్షేత్ర స్థాయిలో మరిన్ని హామీల అమలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రస్తుత ఆర్దిక సంవత్సరానికి కేంద్ర నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి వెసులుబాటు కలగనుంది. మే 10 నాటికి రూ 3500 కోట్ల రుణం వస్తుండటంతో ఓవర్ డ్రాఫ్ట్ వినియోగానికి ఆలోచించాల్సిన పరిస్థితుల నుంచి బయట పడినట్లయింది.












Click it and Unblock the Notifications