వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతిలో జగన్ కు అనుకూలంగా ..బహుజన పరిరక్షణా సమితి

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక పక్క రాజధాని అమరావతిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతుంటే ఇప్పుడు రాజధాని గ్రామాల్లో 50 వేల పక్కా ఇళ్ళు ఇవ్వాలంటూ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలుకుతూ కూడా ఒక వర్గం ఆందోళనలు మొదలు పెట్టింది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు నేటి నుండి ప్రారంభమై రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది . ఇక ఈ సమయంలో అమరావతిలో సంఘీభావ సభలు నిర్వహించటం ఆసక్తికరంగా మారింది.

మద్యపాన ప్రియుల గుండెల్లో జగన్ సర్కార్ మరో ఆటంబాబు పేల్చబోతోందా?: 12 నుంచి 29 వరకు..!మద్యపాన ప్రియుల గుండెల్లో జగన్ సర్కార్ మరో ఆటంబాబు పేల్చబోతోందా?: 12 నుంచి 29 వరకు..!

అమరావతి గ్రామాల్లో జగన్ కు అనుకూలంగా బహుజన పరిరక్షణా సమితి

అమరావతి గ్రామాల్లో జగన్ కు అనుకూలంగా బహుజన పరిరక్షణా సమితి

అమరావతి పరిరక్షణా సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ నేటికీ ఆందోళనలు, రిలీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. అమరావతి రాజధాని విషయంలో ఇప్పటివరకు టీడీపీకి అనుకూలంగా జరిగిన సంఘీభావ సభలు ఇప్పుడు కొత్త రూపు తీసుకుంటున్నాయి. సీఎం జగన్ భూములు లేని నిరుపేదలకు రాజధాని గ్రామాలలో భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సమయంలో సీఎం జగన్‌కు మద్ధతుగానే రాజధాని గ్రామాల్లో టెంట్లు వేసి పేదలకు 50 వేల పక్కా ఇళ్లు ఇవ్వాలంటూ బహుజన పరిరక్షణ సమితి డిమాండ్‌ చేస్తోంది.

సీఎం జగన్ నిర్ణయంతో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం

సీఎం జగన్ నిర్ణయంతో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం

వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ టెంట్లు వేసి సీఎం జగన్ కు అనుకూలంగా సభలు నిర్వహిస్తూ నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం జగన్‌ నిర్ణయం సరైందేనని బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టెంట్లు వేసి మరీ ఈ కార్యక్రమం చేపట్టారు. మూడు రాజధానుల వల్లే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెప్తున్న బహుజన పరిరక్షణ సమితి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల బలహీనవర్గాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు.

పేదలకు 50 వేల పక్కా ఇళ్లు ఇవ్వాలంటూ బహుజన పరిరక్షణ సమితి డిమాండ్‌

పేదలకు 50 వేల పక్కా ఇళ్లు ఇవ్వాలంటూ బహుజన పరిరక్షణ సమితి డిమాండ్‌

అమరావతి ప్రాంతంలో ఉన్న పేదలకు 50 వేల పక్కా ఇళ్లు ఇవ్వాలంటూ బహుజన పరిరక్షణ సమితి డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో కొన్ని ఎకరాల భూమిని పేదలకు పంచుతామంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాల్ని కూడా పంపిణీ చేస్తుందని కూడా పేర్కొంది. ఈ క్రమంలోనే బహుజన పరిరక్షణ సమితి స్థలాలే కాదు పక్కా ఇళ్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సీఎం జగన్ కు అనుకూలంగా అమరావతిలో పోరాటం మొదలు పెట్టింది.

English summary
The Bahujan Conservation Council is demanding 50 thousand houses for the poor in the Amaravati region. The government has already decided to allocate some acres of land in the capital villages to the poor. It also said that the government would soon distribute home sites to the poor. To this end, the bahujan Conservation council is primarily demanding that homes be provided. The fight started in Amaravati in favor of CM Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X