రాజధానుల విచారణలో ట్విస్టులు-ఇద్దరు జడ్డీల్ని తప్పించాలన్న జగన్ సర్కార్ -సీజే తిరస్కారం
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వందకు పైగా పిటిషన్లపై విచారణు హైకోర్టు ఇవాళ మరోసారి ప్రారంభించింది. గతంలో రెండుసార్లు విచారణ ప్రారంభమై మధ్యలో ఆగిపోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హైకోర్టు విచారణ ప్రారంభించింది. అంతే కాదు ఈ విచారణలో తొలిరోజే భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. విచారణలో భాగంగా హైకోర్టుకు జగన్ సర్కార్ ఓ కీలక విజ్ఞప్తి చేయగా.. సీజే జస్టిస్ ప్రశాంత్ మిశ్రా దాన్ని తిరస్కరించారు. దీంతో పాటు ఈ పిటిషన్ల విచారణపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజధానులపై మరోసారి హైకోర్టు విచారణ
ఏపీలో వైసీపీ సర్కార్ రెండేళ్ల క్రితం మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధల నుంచి ఆమోదం తీసుకున్నప్పటికీ న్యాయ ప్రక్రియలో మాత్రం ఆమోదం లభించాల్సి ఉంది. అయితే కార్వనిర్వాహక, శాసన వ్యవస్ధల ఆమోదంపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యలంలో దీనిపై హైకోర్టులో వందకు పైగా పీటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇప్పటికే రెండుసార్లువిచారణ ప్రారంభమై మధ్యలో నిలిచిపోయింది. ఇప్పుడు మూడోసారి ఇవాళ విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టింది.

తొలిరోజే ట్విస్టులు
హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ ప్రారంభమైన తొలిరోజే భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఓ కీలక విజ్ఞప్తికి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ నో చెప్పేశారు. అదే సమయంలో హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఈ పిటిషన్లపై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పిటిషన్లను త్వరలో తేల్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు హైకోర్టు సీజే చేసిన ప్రకటన కూడా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ విచారణ ఈసారి తప్పకుండా కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.

ఇద్దరు జడ్డీల్ని తప్పించాలన్న ప్రభుత్వం
ఈ కేసు విచారణలో హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు జడ్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే విచారణ ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వ న్యాయవాది ఈ పిటిషన్ల విచారణలో భాగంగా ఉన్న త్రిసభ్య ధర్మాసనంలోని మరో ఇద్దరు జడ్డీల్ని తప్పించాలని ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిశ్రాను కోరారు. విచారణ నుండి సత్యనారాయణమూర్తి,సోమయాజులు ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలని కోరారు.
దీంతో ఈ కేసుల్లో ఇదో భారీ ట్విస్టుగా మారిపోయింది. అసలు ఈ ఇద్దరు జడ్డీల్ని ఎందుకు తప్పించాలన్న దానిపై ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. దీంతో ఈ వినతిని ఛీఫ్ జస్టిస్ తోసిపుచ్చారు.
Recommended Video

హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
రాజధాని పిటిషన్లపై సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన విచారణ తొలిరోజు హాట్ హాట్ గా సాగింది. ఈ సందర్భంగా హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కేసుల విచారణకు ఎంతో ప్రాముఖ్యం ఉందని హైకోర్టు సీజే తెలిపారు. ఈ సుదీర్ఘ విచారణ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్టు అనిపిస్తోందన్నారు. కక్షి దారులతో పాటు అందరు ఇబ్బందులు పడుతున్నట్టు అనిపిస్తోందన్నారు. హైబ్రిడ్ పద్దతిలో కొనసాగుతున్న విచారణ కారణంగా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అయినా ఈ పిటి్షన్లపై సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తామని సీజే ప్రకటించారు.












Click it and Unblock the Notifications