చంద్రబాబు సొంత జిల్లాలో 11 వేల ఉద్యోగుల కొంప ముంచేసిన వైసీపీ, వాళ్ల పరిస్థితి ??

ఆంధ్రప్రదేశ్ లో 2019లో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ పుట్టుకొచ్చింది. వాలంటీర్ల వలన సామాన్య ప్రజలకు లాభాలు ఉన్నా అంతకంటే ఎక్కువ లాభం పొందాలని వైసీపీ నాయకులు ప్రయత్నించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మీద పగతో వైసీపీ నాయకులు చేసిన పనిని ఇప్పుడు వేలాది మంది జీవితాలు రోడ్డునపడ్డాయి.

టీడీపీ, జనసేన మీద పగతో వైసీపీ అత్యుత్సాహానికి వాలంటీర్లు బలి అయ్యారు. ఎన్నికల కమీషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత వైసీపీ నాయకులు ఓ స్కెచ్ వేశారు. వాలంటీర్లను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్దీ పొందాలని అనేక ప్రయత్నాలు చేశారు. కూటమి నాయకులు ఈసీకి ఫిర్యాదు చెయ్యడంతో వైసీపీ నాయకులు హడలిపోయారు. వాలంటీర్లు ఏపార్టీకి మద్దతుగా పని చెయ్యకూడదని అప్పట్లో ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

In Chittoor district YCP leaders forced to resign with 90 percent volunteers

వాలంటీర్లను వాడుకుని ఇన్ని రోజులు కాలం గడిపేసిన వైసీపీ నాయకులు అదే వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించి వారిని వైసీపీ పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. అన్ని జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వాలంటీర్ల పరిస్థితి దారుణంగా తయారైయ్యింది.

చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల అత్యుత్సాహానికి కొన్ని వేల మంది వాలంటీర్లు ఈరోజు రోడ్డునపడ్డారు. చిత్తూరు జిల్లాలో సుమారు 12 వేల మందికిపైగా వాలంటీర్లు ఉంటే వారిలో 11, 759 మందితో వైసీపీ నాయకులు రాజీనామాలు చేయించారు. మే నెలలో వాలంటీర్లకు జీతాలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం వారితో రాజీనామాలు చేయించింది. అయితే ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుందని, మీరు ధీమాగా ఉండాలని వాలంటీర్లకు మాయమాటలు చెప్పి వారితో రాజీనామాలు చేయించి ఇప్పుడు 11 వేల మంది జీవితాలను నడిరోడ్డులో వదిలేశారు.

రాజీనామాలు చెయ్యకుండా మొండిగా ఉన్న 10 శాతం మంది వాలంటీర్ల మీద వైసీపీ నాయకులు ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లాలో 10 శాతం మంది వాలంటీర్ల ఉద్యోగాలు గ్యారెంటీగా ఉంటాయని తెలిసింది. అయితే వైసీపీ నాయకులను నమ్ముకుని చిత్తూరు జిల్లాలో రాజీనామాలు చేసిన 90 శాతం మంది వాలంటీర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అన్ని జిల్లాల్లోని వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉన్నా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రాజీనామాలు చేసిన వాలంటీర్ల పరిస్థితి ఎటూ కాకుండాపోతోందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+