సప్త పుణ్యక్షేత్రాల స్పెషల్ టూర్.. తక్కువ ధరకే.. హైదరాబాద్ నుంచే..
మన దేశంలో అనేక చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారత్ లోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. కానీ ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ ఆర్టీసీ మరో అద్భుతమైన టూర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా కర్ణాటకలోని ప్రసిద్ధమైన దేవాలయాలను దర్శించుకునే అవకాశం ఉంది. కర్ణాటకలోని సప్త పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు.
ఈ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలో భాగంగా భక్తులు గోకర్ణ, ఇడగుంజి, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, ధర్మస్థల, కుక్కే తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. గోకర్ణ ఉత్తర కన్నడ జిల్లాల్లోని ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ గంగావళి, అఘనాశిని నదులు గోవు చెవి ఆకారంలో ప్రవహిస్తుంటాయి. అందుకే ఈ ప్రాంతానికి గోకర్ణ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందినదిగా భావిస్తారు. ఇక్కడ ప్రసిద్ధమైన ఆత్మలింగం ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రముఖమైన బీచ్ లు కూడా ఉన్నాయి. వాటిలో ఓం బీచ్, కుడ్లే బీచ్, హాఫ్ మూన్ బీచ్, ప్యారడెజ్ బీచ్ లు పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ బీచ్ ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్ అలాగే సన్ సెట్, సన్ రైజ్ వ్యూస్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అలాగే ఇడగుంజి గణపతి ఆలయం కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడి ఆలయాన్ని సందర్శిస్తే వివాహాలు జరుగుతాయని ప్రతీతి. అలాగే చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి దాదాపు 1500 లకు పైగా చరిత్ర ఉంది. ఏటా లక్షల మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరాన ఉన్న మరో ప్రముఖమైన పుణ్యక్షేత్రం మురుడేశ్వర్. ఇక్కడ ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తయిన 123 అడుగుల పరమ శివుని విగ్రహం చాలా ఫేమస్. అలాగే ఇక్కడ 20 అంతస్తుల్లో రాజగోపురం ఉంటుంది. ఆలయం పక్కనే బీచ్ ఉంటుంది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి స్కూబా డైవింగ్, వాటర్ అడ్వెంచర్స్ కు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక కొల్లూరు మూకాంబిక ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ ఆలయం చాలా మహిమాన్వితమైనది. వీటితోపాటు ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఉడిపి, ధర్మస్థల, కుక్కే ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు.

ఈ టూర్ ఆగస్టు 21 న సాయంత్రం 4 గంటలకు దిల్ సుఖ్ నగర్ నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఎంజీబీఎస్ నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే ఆగస్టు 24 న హైదరాబాద్ కు ఉదయం 8 గంటలకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. టికెట్ ధరలు రూ. 4 వేలుగా ఉన్నాయి. భక్తులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ టూర్ కు సంబంధించిన వివరాల కోసం 9959444165, 9063157042 నంబర్లకు సంప్రదించాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications