Eluru: ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఏదో సినిమాలో ఆపరేషన్ చేసి కడుపులో వాచ్ మారిపోయిన సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. అయితే రీల్.. మరి రియల్ కూడా అలాంటి ఘటనలు జరుగుతోన్నాయి. ఏలూరు జిల్లా మెడికల్ కాలేజీలో ఓ మహిళకు ఆపరేషన్ చేసేటప్పుడు కడుపులు కత్తెర మరిచిపోయి కుట్లు వేశారు. ఆపరేషన్ తర్వాతా మహిళకు తరుచూ కడుపు నొప్పి రావడంతో స్కానింగ్ తీస్తే అసలు విషయం బయట పడింది. పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామానికి చెందిన స్వప్న ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది.
గత ఏప్రిల్ 19 న ఆస్పత్రిలో చేరారు. దీంతో స్వప్నకు సిజేరియన్ చేశారు. తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. కొద్ది రోజుల తర్వాత స్వప్న డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన స్వప్నకు తరుచూ కడపు నొప్పి వచ్చేది. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దు చూపించుకుని మందులు వాడేది. కానీ కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. ఆగస్టు 8న స్వప్నకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తిరిగి అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ పరీక్షించిన వైద్యలు స్వప్నను విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. విజయవాడ వెళ్లి చూపించుకోగా.. వైద్యులు స్కానింగ్ తీసుకోవాలని చెప్పారు. స్కానింగ్ తీసుకున్న తర్వాత వైద్యులుకు చూపిస్తే.. కడుపులు కత్తెర ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్వప్నకు ఆపరేషన్ చేసిన వైద్యులు కత్తెర బయటకు తీశారు. కడుపులో కత్తెరపై ఏలూరు మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ప్రశ్నించగా.. కడపులో కత్తెర మరిచిపోయింది నిజమేనని ఒప్పుకున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లా బచ్చన్నగూడెం గ్రామానికి చెందిన దోటి జ్యోతి కడుపులో వైద్యులు కత్తెరను మర్చిపోయారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం బయటపడింది. జ్యోతి కడుపులో దాదాపు 10 అంగుళాల కత్తెర ఉన్నట్లు ఎక్స్ రేలో తేలింది. ఆమెకు వెంటనే శస్త్ర చికిత్స చేసి కత్తెర బయటకు తీశారు. నాలుగేళ్ల క్రితం నిమ్స్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.












Click it and Unblock the Notifications