మూడేళ్లుగా ఇంట్లోనే తల్లీకూతుళ్లు.. చివరికి ఏం జరిగిందంటే..
కరోనా భయంతో ముడేళ్లు తల్లీకూతుళ్లు బయటకు రాకుండా ఉన్న ఘటన్ కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరులో చోటుచేసుకుంది. వీకి మానసిక సమస్యలున్నాయి. వీరు మొదటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత తల్లీకూతుళ్లు మరింత భయాందోళనకు గురయ్యారు. ఎవ్వరికీ కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. వారే ఆహారం తయారు చేసుకుని.. లోపల ఇంటిలోపలే ఎవరికీ కనపడకుండా ఉండిపోయారు. బయటకు వచ్చేవారు కాదు.

కర్నిడి సూరిబాబు
కుయ్యేరు గ్రామ పంచాయతీ సమీపంలో నివాసముంటున్న కర్నిడి సూరిబాబు ఇంటింటికీ తిరిగి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి భార్య మణి, కూతురు దుర్గాభవాని మానసిక వ్యధతో నేటికీ బయటకు రాకుండా తలుపులు బిగించుకు ఉండిపోయారు.
మొదట్లో గ్రామంలో ఎవరూ లేని సమయంలో తెల్లవారుజామున కాలకృత్యాలకు బయటకు వచ్చేవారు. ఆ తర్వాత పూర్తిగా గదికే పరిమితమయ్యారు.

చేతబడి
చుట్టుపక్కల ఇళ్లవారు, బంధువులు వచ్చి పిలిచినా మీరు మాకు చేతబడి చెయ్యటానికి వచ్చారా.. అంటూ తలుపులు తియ్యకుండా లోపలి నుంచే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసే వారు. దీంతో ఎవరూ వీరిని పలకరించవారు కాదు. సూరిబాబు రోజూ కూరగాయల వ్యాపారానికి వెళ్లివస్తూ వీరికి అవసరమైన ఆహారం, వస్తువులు తెచ్చి ఇస్తుండేవాడు. ఆహారం తీసుకుని వారు ఇంట్లోనే ఉండేవారు.

పోలీసులు
కొద్ది రోజుల క్రితం మణి ఆగోగ్యం దెబ్బతింది. దీంతో సూరిబాబు తన భార్యకు వైద్యం అందించమని దుగ్గుదుర్రు పీహెచ్‌సీకి వెళ్లాడు.
వైద్యసిబ్బంది వచ్చి పిలిచినా తలుపులు తియ్యలేదు. దీంతో గొల్లపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను 108 అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications