షాకింగ్: 'డిజిటల్‌పై తిరుపతిలో లెక్చర్లు! బాబు సొంతూర్లోనే ఏటీఎం లేదు '
చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలో కనీసం బ్యాంకు కార్యాలయం లేదా ఏటీఎం లేదని చెబుతున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగదు రహిత లావాదేవీల గురించి మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని డిజిటల్ ఎకానమీగా మార్చాలో చెబుతున్నారని, కానీ ఆయన తన స్వగ్రామాన్నే గాలికి వదిలేశారని అంటున్నారు.
ఏం చేయాలో నాకు తెలుసు: పవన్‌కు బాబు కౌంటర్! కేవీపీ, వైసీపీలకు కూడా
తిరుపతిలో 104వ సైన్స్ కాంగ్రెస్ జరుగుతోంది. దీనిని మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు మాట్లాడారు.
మరోవైపు, దేశాన్ని డిజిటల్ దిశగా అడుగులు వేయించే దిశలో మోడీ ప్రభుత్వం ఉంది. నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, డిజిటలైజేషన్ పైన చంద్రబాబు నాయకత్వంలో ఓ కమిటీ వేశారు. ఏపీని కూడా డిజిటల్ వైపు చంద్రబాబు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే, చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలో కనీసం బ్యాంకు కార్యాలయం లేదా ఏటీఎం లేదని చెబుతున్నారు. నారావారిపల్లెకు పక్కన ఉన్న చాలా గ్రామాలది ఇదే పరిస్థితి అని చెబుతున్నారు.
పెద్ద నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ నోట్ల కోసం ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి చంద్రగిరి లేదా తిరుపతిలో పనిచేసే ఏటీఎంల కోసం తిరుగుతున్నారని అంటున్నారు.
తిరుపతిలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులు ప్రసంగాల మీద ప్రసంగాలు ఇస్తున్నారు. ఆ వేదికకు కొద్ది దూరంలోనే ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లెనే టెక్నాలజీకి ఆమడదూరంలో పయనిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications