వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోల్ హింస: పోలీస్ సహా 12 మందికి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా బుధవారం జరిగిన రెండు హింసాత్మక సంఘటనల్లో 12 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకన్నాయని గురువారం పోలీసులు తెలిపారు. ఘర్షణకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు.

పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం రాత్రి ప్రకాశం జిల్లాలోని యద్దనపూడి మండలం సూరవారిపల్లిలో రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఘర్షణల్లో పది మంది గాయపడ్డారు, వారిని గుంటూరు ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

In Seemandhra, cop among 12 injured in poll violence

సీమాంధ్రలో బుధవారం లోకసభకు శాసనసభకు జరిగిన పోలింగ్ సందర్భంగా అల్లర్లకు దిగిన గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు గుంటూరు, కడప జిల్లాల్లో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. మరో సంఘటనలో యెరుకొల్లు గ్రామంలో చెలరేగిన ఘర్షణలో ఓ కానిస్టేబుల్‌తో పాటు ఓ వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ఘర్షణలు చెలరేగడంతో గ్రామానికి చేరిన పోలీసులను గుర్తించి, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి, కానిస్టేబుల్‌పై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో నిషేధాజ్ఞలు విధించారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Twelve people, including a constable, were injured in two separate incidents in Andhra Pradesh's Prakasam and Nellore districts, in poll-related violence even as police fired in the air to disperse clashing activists of TDP and YSR Congress, police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X