నేర చరిత్రలో వైసీపీ ఎమ్మెల్యేలదే అగ్రస్థానం .. ఏపీ ఎమ్మెల్యేలు ఎందరిపై క్రిమినల్ కేసులున్నాయంటే ?
మనం ఎన్నుకున్న నాయకులు ఎలాంటి వారో తెలుసా ? వారిపై ఎలాంటి నేరారోపణలు ఉన్నాయో తెలుసా ? దేశ వ్యాప్తంగా ఎంపీలే కాక ఎపీలోని ఎమ్మెల్యేలలో ఎందరు నేరచరితులు ఉన్నారో తెలుసా ? ఆ లెక్కలను తన నివేదిక ద్వారా అందించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్.

ఏపీ ఎమ్మెల్యేలలో నేరచరితులు ఎందరో అన్న అంశంపై నివేదిక ఇచ్చిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్
ఏపీలో హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో 175 నియోజకవర్గాలుంటే... వాటిలో 151 సీట్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక టీడీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. జనసేన ఓ సీట్లో విజయం సాధించింది. ఇక అసెంబ్లీలో కొత్త సభ్యులు కొలువుదీరుతున్నారు. త్వరలోనే అసెంబ్లీలో అడుగుపెట్టనున్న నేతలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తం 175 మందిలో నేరచరితులు ఎంతమంది? క్లీన్ ఇమేజీ ఉన్న వారెంత మంది అన్న వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదికను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఎంపీల నేర చరిత్ర తో పాటు ఎమ్మెల్యేల నేరచరిత్రపై విడుదల చేసిన ఆసక్తి కర అంశాలు ఇలా ఉన్నాయి.

175 మంది ఎమ్మెల్యేల్లో 55 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయన్న నివేదిక
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సర్వే నివేదిక ప్రకారం 175 మంది ఎమ్మెల్యేల్లో 55 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని సమాచారం . అంటే... మూడొంతుల్లో రెండొంతులు మందిపై నేరచరిత్ర ఉన్నట్టే . ఇక 32 శాతం మంది నేర చరితులేనన్న మాట. నేరారోపణలు ఉన్న వారే కాక వీరిలో ఓ 8 మంది దోషులుగా తేలిన వారున్నారన్న సంచలన విషయాన్ని ఏడీఆర్ బయటపెట్టింది. ఇక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల) తో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలపై ఏకంగా హత్యాతయ్నం కేసులున్నాయని వెల్లడించింది . ఆరుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై దాడులకు పాల్పడ్డారన్న కేసులు కూడా నమోదయ్యాయని చెప్పింది . ఏడుగురిపై కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయని పేర్కొంది.

నేర చరితుల విషయంలో వైసీపీదే అగ్ర స్థానం.. స్వయంగా వారిచ్చిన అఫిడవిట్ల ఆధారంగానే నివేదిక
ఇక పార్టీల వారీగా నేర చరితుల రికార్డుల విషయానికి వస్తే... నేర చరితుల విషయంలో వైసీపీనే అగ్ర స్థానంలో ఉంది. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 50 మంది (33 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది . అదే టీడీపీ విషయానికి వస్తే... 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో సీరియస్ క్రిమినల్ కేసులున్న వారు నలుగురు మాత్రమేనట. అంటే.. 17 శాతం అన్న మాట. ఇక జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా సీరియస్ క్రిమినల్ కేసులున్న వ్యక్తేనట. మొత్తానికి ఎమ్మెల్యేలు , ఎంపీలకు సంబంధించిన ఈ వివరాలు వారు సాక్షాత్తు ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించిన వివరాలు .












Click it and Unblock the Notifications