ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం..ఆ పార్టీకే మేలు..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా, ఏపీలో పార్లమెంట్‌తో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. చెదురుమొదురు ఘటనలు మినహా మూడోదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. ఇక గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేన్నంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81 శాతం ఓటింగ్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఎన్నికల్లో 79.8 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో 81 శాతం కావడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది రాజకీయ నాయకులు ఓ అంచనా వేసుకుంటున్నారు.

increase in polling percentage from ap elections

ఒకప్పుడు ఓటింగ్ శాతం పెరిగితే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం జరుగుతుండేది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికలను ఓసారి పరిశీలిస్తే ఓటింగ్ శాతం పెరగడం అధికార పార్టీలకు కూడా కలిసి వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 & 2009లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 2% ఎక్కువ పోలింగ్ నమోదు అయింది. ఇక్కడ పోలింగ్ శాతం పెరిగింది. అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంపై సానుకూలత ఉండటంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గుజరాత్, తెలంగాణ, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో అధికార పార్టీలే తిరిగి విజయం సాధించడం జరిగింది.

ప్రభుత్వంపై పాజిటివ్ ఉంటే ఓటింగ్ శాతం పెరిగిన విజయం సాధించవచ్చని మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి నాయకులు నిరూపించారు. ఈ విషయంలో లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగానే ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరగడంతో అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.పేద ప్రజలు, మహిళలు తమకు అండగా నిలిచారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెరగడం తమకు కలిసి వస్తుందని కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందని కూటమి నేతలు చెబుతున్న మాట. మరీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సి ఉందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+