అగ్రరాజ్యాలను మించిన భారతీయ రైల్వే
ప్రపంచంలో రైలుమార్గం కలిగిన దేశాలను పరిశీలిస్తే భారత రైల్వేల్లో ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే భారతీయులు ప్రతి ఒక్కరు తమ జీవనంలో రైల్వేను భాగంగా చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న రైళ్లతో స్థానికంగా నివసించే ప్రజలు అనుబంధాన్ని పెంచుకున్నారు. రైలు పేరు చెబితేనే వారిలో భావోద్వేగాలు కలుగుతాయి. అంతగా వారితో భారతీయ రైల్వే మమేకమైపోయింది.
అమెరికా, రష్యా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలోనే అత్యంత పొడవైన ప్లాట్ ఫాంలున్నాయి. రైల్వే స్టేషన్ల జాబితా పరిశీలిస్తే టాప్ 10 స్టేషన్లలో అత్యధికం భారత్ లోనే ఉన్నాయి. మనదేశంలో అత్యంత పొడవైన ప్లాట్ ఫాం కలిగిన రైల్వే స్టేషన్ గా హుబ్లీ రికార్డులకెక్కింది.
సిద్ధరూఢ స్వామిజీ రైల్వే స్టేషన్ హుబ్లీలో ఉంది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ పొడవు 1505 మీటర్లు (4,938 అడుగుల). మొత్తం 8 ప్లాట్ ఫారమ్‌లున్నాయి. ప్లాట్‌ఫామ్ నెంబరు 1, 8 అత్యంత పొడవైన ట్రాక్ ను కలిగివున్నాయి.

అత్యంత పొడవైన రెండో ప్లాట్ ఫాం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఉంది. దీని పొడవు 1366.33 మీటర్లు. ఇక్కడ ప్లాట్ ఫాం పొడవు 1366.33 మీటర్లు. మూడో స్థానంలో కేరళలోని కొల్లం స్టేషన్ నిలిచింది. ప్లాట్ ఫామ్ పొడవు ఇక్కడ 1180.5 మీటర్లు. నాలుగో స్థానంలో ఖరగ్ పూర్ రైల్వేస్టేషన్ (1072.5 మీటర్లు), 5వ స్థానంలో స్టేట్ స్ట్రీట్ సబ్‌వే ఆఫ్ చికాగో (US)1067 మీటర్లు, 6వ స్థానంలో ఉత్తరప్రదేశ్ లోని ఫిలిభిత్ (900 మీటర్లు), 7వ స్థానంలో యూఎస్ లోని కాలిఫోర్నియాలో పోంటానా స్టేషన్(791 మీటర్లు), చత్తీసగఢ్ లోని బిలాస్ పూర్ స్టేషన్ 802 మీటర్లుతో 8వ స్థానంలో, బ్రిటన్ షెరటన్ షటిల్ టెర్మినల్ ఫోక్ సోటన్ (731 మీటర్లు), 9వ స్థానంలో ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ 770 మీటర్లు), 10వ స్థానంలో ఆస్ట్రేలియాలోని ఈస్ట్ పెర్త్ రైల్వేస్టేషన్ (650 మీటర్లు) నిలిచింది.












Click it and Unblock the Notifications