విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్‌కు గురువారం చివరి రోజు కావడంతో నేతలందరూ కూడా ఆర్వో కార్యలయాలకు క్యూ కడుతున్నారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మంత్రి విడుదల రజిని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విడుదల రజిని..ఈసారి ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి బరిలో దిగుతున్నారు. అయితే విడుదల రజిని పేరున్న మరో మహిళ సైతం గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విడుదల రజిని అనే మహిళ కిడ్నాప్ కావడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చిన స్వతంత్ర అభ్యర్థి విడుదల రజినిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వద్ద ఉన్న ఆమెను అక్కడి నుంచి బలవంతంగా నామినేషన్ వేయకుండా తీసుకెళ్లారు. ఆ మహిళను వైసీపీ నాయకులే కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆ మహిళ పోటీ చేస్తే.. వైసీపీకి నష్టం వాటిల్లుతుందనే ఆ పార్టీ నాయకులు స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై వైసీపీ నాయకులు సైతం టీడీపీ నాయకులకు గట్టిగానే కౌంటరిస్తున్నారు. మా పార్టీ అభ్యర్థి పేరుతో ఉన్న మహిళను తెర మీదకు తీసుకువచ్చి మమ్మల్ని దెబ్బ తీయాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని..ఆ మహిళ చేత టీడీపీ నాయకులే నామినేషన్ వేయించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి విడుదల రజిని అనే మహిళ ఇప్పుడు కిడ్నాప్ కావడం గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications