ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్
గోవా నుండి దక్షిణకోస్తా వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల వ్యవధిలో పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
పిడుగులతో వర్షాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

రైతులు, రైతు కూలీలకు హెచ్చరిక
ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు బహిరంగ ప్రదేశాలతోపాటు స్తంభాలు, చెట్లు, టవర్లకింద ఉండొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో , గుంటూరు జిల్లా మంగళగిరిలో 35 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా అమరావతిలో 31మిమీ, తిరుపతి జిల్లా చిత్తమూరులో 42.5మిమీ, దొరవారిసత్రంలో 42.5మిమీ, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 27 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పిడుగులు పడే అవకాశాన్ని ముందుగానే గమనించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గరుంది.












Click it and Unblock the Notifications