వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నానం సీన్స్ పంపింది..: పాక్ గర్ల్‌కు సైన్యం రహస్యాలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత సైన్యానికి చెందిన రహస్యాలు, కొన్ని పత్రాలు, చిత్రపటాలను పాకిస్తాన్ యువతికి అందించాడన్న ఆరోపణల పైన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు సుబేదర్ పతన్ కుమార్‌ను బుధవారం అరెస్టు చేశారు. దేశద్రోహానికి పాల్పడ్డాడన్న అభియోగాలతో అతని పైన కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

పాకిస్తాన్‌కు చెందిన యువతి అనుష్క అగర్వాల్ పేరుతో ఇతనితో సామాజిక వెబ్‌సైట్లలో పరిచయం పెంచుకుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తాను రీసెర్చ్ స్కాలర్‌నని చెప్పి నమ్మబలికింది. అంతేకాదు, తన మెయిల్ ఐడీ ద్వారా తన నగ్న చిత్రాలను పంపించింది. స్నానం చేసే దృశ్యాలను వీడియో ద్వారా పంపించింది. దీంతో పతన్ కుమార్ ఆమె కోరిన వివరాలు, సైన్యానికి చెందిన చిత్రపటాలను పంపించాడు.

పతన్ కుమార్ కంప్యూటర్‌ తెరపై కంటికి ఇంపుగా ఉన్న అమ్మాయి కనిపించే సరికి ఒళ్లు మరిచిపోయాడు. నాలుగు తియ్యటి మాటలు చెప్పి, శృంగార చిత్రాలు చూపించేసరికి నోరు జారిపోయాడు. విధిని, విద్యుక్త ధర్మాన్ని మరిచి గుట్టు విప్పాడు. విదేశీ చేతికి దేశ రహస్యాలు అప్పగించాడు. నిబంధనలకు విరుద్ధంగా నెట్‌వర్కింగ్‌ వ్యాపారం చేస్తూ... శత్రుదేశం విసిరిన నెట్‌‌లో పడిపోయాడు పతన్‌ కుమార్‌ పొద్దర్‌.

Indian army man falls into Pakistan ‘honeytrap’

అతని స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా. సికింద్రాబాద్‌లోని ఆర్మీ విభాగమైన ఈఎంఈ (ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌) యూనిట్‌లో నాయక్‌ సుబేదార్‌. ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని 151, ఎంసీ/ఎంఎఫ్‌ డిటాచ్‌మెంట్‌లో విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. పతన్‌ కుమార్‌ ఒకవైపు సైన్యంలో ఉద్యోగం చేస్తూనే... ‘సెక్యూర్డ్‌ లైఫ్‌' కంపెనీ తరఫున నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ వ్యాపారం మొదలుపెట్టాడు.

ఆర్మీలోనితోటి ఉద్యోగులను, ఇతరులను, స్నేహితులను, బంధువులను ఈ నెట్ వర్కింగ్‌లో చేర్పించుకుంటున్నాడు. ప్రస్తుతం తను పని చేస్తున్న కార్యాలయంలో ఉండే కంప్యూటర్‌ను, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను వాడుకుంటున్నాడు. నిత్యం ఆన్‌లైన్‌‌లో ఉండటానికి అలవాటుపడ్డాడు. ఫేస్‌బుక్‌లో ఉపయోగించేవాడు.

ఇదే క్రమంలో పాకిస్థానీగా భావిస్తున్న ఓ విదేశీ యువతి పతన్‌పై వల విసిరింది. అనుష్కా అగర్వాల్‌ పేరిట ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుంది. పతన్‌, అనుష్కా కొన్నాళ్లపాటు ఫేస్‌బుక్‌ చాట్‌లో తియ్యటి మాటలు చెప్పుకొన్నారు. ఆ తర్వాత పరస్పరం ఫోన్‌ నెంబర్లు ఇచ్చుకున్నారు. సుమారు రెండేళ్లుగా ఈ కథ నడుస్తోంది. పతన్‌కు ఆమె రోజూ రెండుమూడు సెక్సీ ఫొటోలను పంపేది. పతన్ కుమార్‌ కూడా మంచి మంచి పోజులున్న తన ఫొటోలను ఆమెకు పంపించేవాడు.

పతన్‌ను అనుష్క పూర్తి స్థాయిలో వలలో వేసుకుంది. మెల్లమెల్లగా తన అసలు పని ప్రారంభించింది. ఆర్మీ రహస్యాలను అడగడం మొదలుపెట్టింది. అనుష్క మాయలో పడిపోయిన పతన్‌ ఆమె అడగడంతో తనకు తెలిసిన అధికారిక సమాచారం మొత్తం ఇచ్చేవాడు. తనకు తెలియని విషయాలను తెలుసుకుని మరీ చెప్పేవాడు. వ్యూహాత్మకమైన సైనిక స్థావరాలు, వివిధ యూనిట్లకు చెందిన బలగాల కదలికలు, ముఖ్యమైన అధికారుల ఫోన్‌ నెంబర్లను అనుష్కకు చేరవేసేవాడు.

వివిధ ప్రాంతాల్లోని సైనిక సిబ్బందితో మాట్లాడి... ఆర్టిలరీ రెజిమెంట్లు, కమాండ్స్‌, డివిజన్‌ హెడ్‌ క్వార్టర్స్‌, బ్రిగేడ్‌లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అనుష్కకు పూసగుచ్చినట్లు చెప్పేవాడు. ఇందుకు బదులుగా అనుష్క తన సెక్సీ చిత్రాలు పంపడంతోపాటు, అప్పడప్పుడు పతన్‌ బ్యాంకు ఖాతాలో డబ్బు కూడా జమ చేసేదట. అను ష్క అగర్వాల్‌ పాకిస్థాన్‌ దేశీయురాలు కావొచ్చునని, ఇలాంటివి వారే ఎక్కువగా చేస్తుంటారని టాస్క్‌ఫోర్స్‌ అధికారి ఒకరు చెప్పారు.

దేశ రక్షణ రహస్యాలను సరిహద్దులు దాటించిన పతన్‌ కుమార్‌ గుట్టు హైదరాబాద్‌ పోలీసులే విప్పారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యాపారాలు చేయకూడదు. కానీ, పతన్‌ సైన్యంలో ఉంటూ ఈ పని చేస్తున్నట్లు సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు పతన్‌పై నెట్‌వర్క్‌‌పై నిఘా పెట్టారు. ఈ విషయం వ్యాపారానికే పరిమితం కాలేదని, దేశ భద్రతకు ముప్పుతెచ్చేంత దూరం వెళ్లిందని గుర్తించారు.

అధికార రహస్యాల చట్టానికే తూట్లు పొడుస్తున్నాడని తేల్చారు. ఆర్మీ అధికారులకు సమాచారం అందించి వారి సహకారంతో పతన్‌ను అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. అధికారిక రహస్యాల చట్టం 3, 4, 5 రెడ్‌విత్‌ 120బీ, ప్రైజ్‌ చిట్స్‌ మనీ సర్క్యులేషన్‌ నిషేధ చట్టం 3, 4 సెక్షన్ల కింద సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని హైదరాబాద్‌ నగర సిటీ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

English summary
The Hyderabad police on Monday arrested an Army man for passing on classified information regarding the Indian Army to a suspected Pakistani agent. A case under the Official Secrets Act has been booked against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X