Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీటీడీకి బిలియనీర్ మంతెన రామరాజు భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే ??

తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. అమెరికాలో ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన పారిశ్రామిక వేత్త మంతెన రామలింగ రాజు.. ఈసారి రూ. 9 కోట్లు విరాళంగా సమర్పించారు. ఈ మొత్తం ఆయన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేర్లపై టీటీడీకి అందజేశారు. ఈ విరాళాన్ని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వీకరించారు.

పీఏసీ భవనాల ఆధునీకరణ..

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ.. పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునీకరణ కోసం మంతెన రామలింగ రాజు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన వసతులను అందించేందుకు ఈ విరాళం వినియోగించబడుతుందని చెప్పారు. ప్రతి రోజు లక్షల్లో భక్తులు తిరుమల చేరుతుండగా.. కొత్త సౌకర్యాల అభివృద్ధి అత్యవసరమని, ఇలాంటి సేవాభావం ఎంతో ప్రేరణనిస్తుందని అన్నారు.

Indian origin Billionaire Mantena Ramaraju 9 crores donation to TTD

కాగా గతంలో కూడా మంతెన రామలింగ రాజు టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. 2017లో తిరుమల శ్రీవారికి 28 కిలోల బంగారు సహస్రనామ మాలను అందజేయడం ద్వారా ఆయన దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ కుటుంబానికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆరాధ్యదైవం కావడం.. నాటి నుంచే సేవాభావం కొనసాగిస్తుండడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మంతెన రామరాజు ఎవరంటే..?

మంతెన రామరాజు మంతెన ప్రస్తుతం అమెరికాలో భారీ ఫార్మాస్యూటికల్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ఆయన Ingenus Pharmaceuticals సంస్థకు చైర్మన్, సీఈవో. అంతేకాక, ICORE Healthcare, Onco Scripts వంటి గ్లోబల్ హెల్త్‌కేర్ వెంచర్లు కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అమెరికా, స్విట్జర్లాండ్, భారతదేశం తదితర దేశాలలో విస్తరించిన వ్యాపారాలతో ఆయన ఫార్మా రంగంలో ఒక ప్రపంచ స్థాయి లెజెండ్ గా పేరుపొందారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామరాజు, తన విద్యాభ్యాసాన్ని పూర్తిగా భారతదేశంలోనే చేశారు. జేఎన్టీయూ (JNTU) నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో క్లినికల్ ఫార్మసీలో స్పెషలైజేషన్ చేశారు. పలు ఫార్మా కంపెనీల్లో పనిచేసిన అనంతరం స్వంతంగా వ్యాపారాలను ప్రారంభించి, క్రమంగా ఎదిగి ఇప్పుడు అమెరికా ఫార్మా రంగంలో అగ్రస్థానానికి ఎదిగారు. ప్రస్తుతం రామరాజు మంతెన నెట్ వర్త్ దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ.167 కోట్లు) ఉంటుందని అంచనా.

మంతెన రామరాజు కుమార్తె వివాహం.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె నేత్ర మంతెనకు.. సూపర్‌ఆర్డర్‌' సహ వ్యవస్థాపకుడు వంశీ గాదిరాజు వివాహాం జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు వివిధ దేశాల నుంచి 600 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్, షాహిద్‌ కపూర్, రణబీర్‌ కపూర్‌ హాజరయ్యారు. అలానే నటీమణులు మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, కృతి సనన్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు ట్రంప్‌ జూనియర్, అతడి గర్ల్ ఫ్రెండ్.. ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+