రైల్వే గుడ్ న్యూస్.. రిజర్వేషన్ అవసరంలేదు!
కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని జనరల్ టికెట్లను కూడా రిజర్వేషన్ కేటగిరిలోకి రైల్వే శాఖ మార్చింది. ప్రయాణించడానికి జనరల్ టికెట్ కావాలన్నా మూడు రోజుల ముందుగా తీసుకోవాల్సి వచ్చేది. అప్పటికప్పుడు కౌంటర్లలో ఇచ్చేవారు కాదు. దీనిపై అవగాహన లేక ఇటీవలికాలం వరకు ప్రయాణికులతా ఇక్కట్లకు గురయ్యేవారు. కానీ ఈ విషయంలో రైల్వేశాఖ శుభవార్త వినిపించింది.
సూపర్ ఫాస్ట్, మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లల్లోని అన్ రిజర్వుడ్ సీట్లను పునరుద్ధరించింది. దీంతో కరోనాకు ముందు ఉన్నట్లుగా అప్పటికప్పుడు కౌంటర్లలో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం చేయవచ్చు. కొవిడ్ రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ జనరల్ టికెట్లను కూడా రిజర్వుడు కేటగిరిలోకి తెచ్చింది. సాధారణంగా ముందు 2 బోగీలు, చివర్లో 2 బోగీలు జనరల్ కు కేటాయిస్తారు. రైలు తిరిగే మార్గాన్ని బట్టి, రద్దీని అంచనా వేసి ఒక్కోసారి మరో 2 బోగీలను అదనంగా ఏర్పాటు చేస్తారు.

జనరల్ టికెట్లను పునరుద్ధరించడానికి ముందు రిజర్వేషన్ ఛార్జీ కింద రూ.20 అదనంగా వసూలు చేసేవారు. ఇక నుంచి వాటిని చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని రైళ్లల్లో రిజర్వ్ డ్ సీట్ల ముందస్త బుకింగ్ ఉంటే 120 రోజుల వరకు ఆ కోచ్ లకు ఎలాంటి అన్ రిజర్వుడ్ టికెట్లు జారీచేయరు. రైల్వే నిబంధనల ప్రకారం 120 రోజల ముందుగానే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కరోనాను కట్టడి చేసేందుకు 2020 మార్చిలో లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలో ప్రయాణికుల రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. ఆంక్షలు సడలించిన తర్వాత మే 15వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్ల పేరుతో వాటిని తిప్పడం ప్రారంభించారు. 2022 డిసెంబరు వరకు వాటిని స్పెషల్ ట్రైన్స్ గా నడిపి అదనపు ఛార్జీలు వసూలు చేశారు. ఇకనుంచి అదనపు ఛార్జీల మోత ఉండబోదు.












Click it and Unblock the Notifications