ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
తరుచుగా రైళ్లల్లో ప్రయాణించేవారు నాణ్యమైన భోజనం అందుబాటులో ఉండక ఇబ్బందులకు గురవుతుంటారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఒక్క రైల్వేల ద్వారానే నాలుగు కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో కొంత శాతం తరుచుగా, రెగ్యులర్ గా ప్రయాణించేవారు కూడా ఉంటారు. రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫారాలపై దొరుకుతున్న భోజనాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండటంతో అధికారులు దృష్టిసారించారు.
రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించేవారికి సమయాన్ని బట్టి ప్యాంట్రీకార్ అందుబాటులో ఉంటుంది. లేదంటే కాంట్రాక్టర్లు భోజనాన్ని తీసుకొస్తారు. కానీ రైలులోని సాధారణ బోగీల్లో ప్రయాణించేవారికి మాత్రం భోజనం అందుబాటులో ఉండదు. ఇకనుంచి వారికి కూడా నాణ్యమైన భోజనం అందించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ప్లాట్ ఫారాలపై జనరల్ బోగీలు ఆగే ప్రాంతంలో ఎకానమీ మీల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎకానమీ ధరలకే భోజనం, స్నాక్స్ అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. పూరీ, కూరగాయలు, ఊరగాయ 20 రూపాయలకు ఇవ్వనున్నారు. ధర ప్రకారం ప్రయాణికులకు 7 పూరీలు, 150 గ్రాముల కూరగాయల కర్రీ, ఊరగాయ ప్యాకెట్ రూ.20కి లభిస్తాయి. దీన్ని టైప్-1 భోజనంగా పరిగణిస్తారు. అలాగే టైప్-2 భోజనం ఖరీదు రూ.50.
ఇందులో 350 గ్రాముల స్నాక్స్, భోజనం లభిస్తుంది. రాజ్మా-రైస్, ఖిచ్డీ, చోలే కుల్చే, చోలే భాతురే, పావ్ భాజీ లేదంటే మసాలా దోశ ఇస్తారు. .3కే 200ఎంఎం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంటుంది. ప్రతి రైలులో ఇంజన్ దగ్గర కనీసం రెండు జనరల్ బోగీలుంటాయి. ఒకటి రైలు చివరలో ఉంటుంది. ఆహారం అందుబాటులోకి వచ్చిన తర్వాత అదనపు రుసుము వసూలు చేస్తే ప్రయాణికులు ఏదైనా స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు












Click it and Unblock the Notifications