రైల్వే ప్రయాణికులకు కొత్తగా 2 నిబంధనలు
మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న భారతీయ రైల్వే తాజాగా రెండు నిబంధనలను తీసుకొచ్చింది. ప్రయాణికులకు అత్యంత సౌకర్యంతో కూడిన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడానికి రైల్వే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
2024 ఆర్థిక సంవత్సరంలో రైల్వేను బలోపేతం చేయడం కోసం కేంద్రం నిధులు కేటాయించింది. ప్రయాణ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడానికే వీటిని ఉపయోగించనున్నారు. జనతాఖానా పేరుతో 20 రూపాయలకే భోజనం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 49 పైసలకే 10 లక్షల రూపాయల బీమా కవరేజ్ ను పొందవచ్చు. రైలు ప్రయాణ సమయంలో ప్రమాదాలు సంభవిస్తే ఈ కవరేజ్ ద్వారా ఉచిత వైద్య చికిత్స కూడా అందిస్తారు.

రైల్వే అధికారిక వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఈ విలువైన బీమా పథకానికి యాక్సెస్ ను మంజూరు చేస్తారు.చాలామంది దీన్ని పట్టించుకోరు. కానీ 49 పైసలకే 10 లక్షల రూపాయల బీమా లభిస్తోందని, దీనిపై దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగితే నామినీకి బీమా సొమ్మును అందజేస్తారు.
ప్రయాణికులు స్టేషన్‌లో రాత్రిపూట బస చేయాల్సి వచ్చినప్పుడు వారికి ఉచితంగా వసతి కల్పించేందుకు రైల్వే ప్రయత్నిస్తోంది. ఈ సౌకర్యం ఉచితంగా అందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పొడిగించిన స్టాప్ ఓవర్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ విధానం త్వరలోనే అమలు చేయబోతున్నారు.తద్వారా ప్రతి ఒక్కరికీ రైలు ప్రయాణాన్ని మధురానుభూతిగా మిగల్చాలనేదే భారతీయ రైల్వే ఆకాంక్ష.












Click it and Unblock the Notifications