ప్రయాణికులకు ముఖ్య గమనిక... రైల్వే కీలక నిర్ణయం
కాలానుగుణంగా భారతీయ రైల్వేలు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యంతో కూడిన ప్రయాణ అనుభూతిని కలిగించడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా లక్ష కిలోమీటర్లకు పైగా విస్తరించిన రైల్వే లైన్లు అత్యంత తక్కువ ధరతో ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రతిరోజు నాలుగు కోట్ల మంది రైల్వే ద్వారా ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో నాలుగో స్థానంలో భారత్ నిలిచింది.
ఎప్పటికప్పుడు నియమ నిబంధనలను సవరిస్తూ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసం భారతీయ రైల్వే నిరంతరం తనని తాను మార్చుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా ఒక నిబంధనను సవరించింది. ఇప్పుడు రైలు ఎక్కేందుకు 10 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే వారి టికెట్‌ను రద్దు చేసి సీటును మరో ప్రయాణికుడికి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. వాటిగురించి తెలుసుకుందాం.

బుక్ చేసుకున్న టికెట్ ప్రకారం ప్రయాణికుడు వస్తాడా? రాడా ? అని టీటీఈ కేవలం పదినిముషాలు మాత్రమే వేచిచూస్తాడు. తర్వాత ఆ సీటులో ప్రయాణికుడు కనిపించకపోతో గైర్హాజరుగా నమోదు చేస్తాడు. ఆ సీటును రద్దు చేసి మరో ప్రయాణికుడికి కేటాయిస్తారు. ఇంతకుముందు రిజర్వేషన్ ఛార్ట్ ను పరిశీలించేవారు. కానీ వారి చేతుల్లో ఇప్పుడు హ్యాండ్ హోల్డ్ టెర్మినల్ ఉంటోంది. ఎక్కడికక్కడ ప్రయాణికుల టికెట్లను టీటీఈ తనిఖీ చేస్తుంటారు. వచ్చారా? రాలేదా? అనే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తుంటారు. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ నుంచి వెంటనే సీట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అలా కానిపక్షంలో టికెట్లు రద్దయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. సీటు దగ్గరకు చేరుకునే క్రమంలో కొంత ఆలస్యమైనప్పటికీ టీటీఈ కొంత అదనపు సమయాన్ని కేటాయిస్తారు. అయితే టికెట్ ఉంటుందా? లేదా? అనేది టీటీఈ నిర్ణయంమీద ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications