ట్రైన్ టికెట్ పోయిందా? పర్వాలేదు..
సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు రైలు టికెట్ కావాలంటే గంట నుంచి గంటన్నర సమయం క్యూలో నిలబడే సందర్భాలున్నాయి. కానీ ఆన్ లైన్ లో ఎంతో సులభగా టికెట్ తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్ కు రావాల్సిన అవసరం ఉండదు.. గంటల తరబడి క్యూలో ఎదురుచూడాల్సిన సందర్భం రాదు. అయితే ఇప్పటికీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ తీసుకున్నవారు ఎక్కువగానే ఉంటున్నారు. రైలు టికెట్ పోతే ఏం చేయాలి? అనే సందేహం ఎప్పుడూ వెంటాడుతుంటుంది. టికెట్ పోగొట్టుకుంటే ఏం చేయాలో చూద్దాం.
తరుచుగా ప్రయాణాలు చేసేవారు రైలు నియమ, నిబంధనల గురించి కూడా తెలుసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా ట్రైన్ టికెట్ పోయినా వెంటనే డూప్లికేట్ తీసుకునే వెసులుబాటు ఉంది. మీ పేరుతో టికెట్ కౌంటర్ లో లేదంటే టీటీఈ సహాయంతో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. స్లీపర్ లేదా సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.50 తీసుకుంటారు. ఏసీ కోచ్ టికెట్ అయితే రూ.100 వసూలు చేస్తారు. ఒకవేళ రిజర్వేషన్ ఛార్ట్ సిద్ధమైన తర్వాత తర్వాత డూప్లికేట్ టికెట్ కావాలంటే మాత్రం టికెట్ ఛార్జీలో 50 శాతం చెల్లించాల్సిందే.

ఒకవేళ టికెట్ చిరిగిపోయినా టికెట్ ఛార్జీలో 25 శాతం చెల్లించి డూప్లికేట్ టికెట్ పొందొచ్చు. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు మాత్రం డూప్లికేట్ టికెట్ ఇవ్వరు. డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒరిజినల్ టికెట్ దొరికితే టికెట్ కౌంటర్ లో డిపాజిట్ చేసి రిఫండ్ తీసుకోవచ్చు. తరుచుగా రైల్వే ప్రయాణం చేసేవారు ఇలాంటి నిబంధనల గురించి తెలుసుకుంటే జర్నీలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు












Click it and Unblock the Notifications