ఏపీకి అత్యంత శుభవార్తను వినిపించిన కేంద్రం
ఏపీకి సంబంధించిన రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఎల్ హెచ్ బీ బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. లింక్డ్ హాఫ్ మన్ బుష్ బోగీలుగా వీటిని వ్యవహరిస్తారు. దీనివల్ల ప్రయాణంలో ఎటువంటి కుదుపులు ఎదురుకావు. ప్రయాణం చాలా సౌకర్యవంతంగా సాగుతుంది.
అన్నీ ఎల్ హెచ్ బీ బోగీలే
ఈనెల 24 నుంచి విశాఖ-చెన్నై సెంట్రల్ (22801) వీక్లీ ఎక్స్‌ప్రెస్, ఈనెల 25 నుంచి చెన్నై సెంట్రల్-విశాఖ (22802) వీక్లి రైలు, ఈనెల 26 నుంచి విశాఖ-పారాదీప్(22810) వీక్లి ఎక్స్‌ప్రెస్, ఈనెల 27 నుంచి పారాదీప్-విశాఖ (22809) వీక్లి ఎక్స్‌ప్రెస్, ఈనెల 28 నుంచి విశాఖ-కర్నూల్ టౌన్ (08585) వేసవి ప్రత్యేక రైలు, ఈనెల 29 నుంచి కర్నూల్ టౌన్-విశాఖ (08586) వేసవి ప్రత్యేక రైలు ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడవనున్నాయి. వీటిల్లో ఒక జనరేటర్ మోటార్ కార్, ఒక సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజీ/ దివ్యాంగజన్ కోచ్, రెండు సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, తొమ్మిది స్లీపర్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ తో ఈ రైళ్లు నడుస్తాయి.

ఐసీఎఫ్ బోగీల నిర్మాణానికి చెక్
జర్మనీకి చెందిన లింకే హాఫ్ మన్ బుష్ ఈ తరహా కోచ్ ను తయారు చేశారు. చెన్నై, రాయ్ బరేలి, కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ తయారీలోని యూనిట్లలో వీటిని తయారుచేస్తున్నారు. జర్మనీ సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నారు. మొదట్లో జర్మనీ నుంచి 24 ఏసీ కోచ్ లను భారతీయ రైల్వే దిగుమతి చేసుకుంది. అప్పటివరకు తయారీలో ఉన్న ఐసీఎఫ్ కోచ్ లస్థానంలో ఎల్ హెచ్ బీ కోచ్ లు ఉంటాయని అధికారులు ప్రకటించారు. చివరిసారిగా ఐసీఎఫ్ కోచ్ 2018 జనవరి 19న ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అప్పటి నుంచి ఇండియన్ రైల్వే అన్నీ ఎల్ హెచ్ బీ బోగీలే తయారుచేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ఉన్న భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతోంది. రైళ్లల్లో కూడా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications