మనదేశంలో రైలు జన్మిస్తుంది తెలుసా? అలా పుట్టి 55 ఏళ్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే అత్యాధునిక సౌకర్యాలతో ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. అలా వచ్చినవే వందేభారత్ రైళ్లు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య దూరాన్ని అతి తక్కువ సమయంలో చేరుకోవడమే వీటి లక్ష్యం. వందేభారత్ కు ముందు భారతీయ రైల్వేకు ఒక ముద్దుల రైలు ఉండేది. దాన్ని ఎంతో మెరిపెంగా చూసుకునేది. దాని పేరు రాజధాని ఎక్స్ ప్రెస్. దేశ రాజధాని ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు తక్కువ సమయంలో చేరుకునేలా రూపొందించిన పూర్తి ఎయిర్ కండిషన్డ్ రైలు. రైల్వే వ్యవస్థకే గర్వకారణంగా నిలిచిన రాజధాని ఎక్స్ ప్రెస్ కు బంగారు పాప అని పేరు పెట్టారు.
56వ వసంతంలోకి అడుగు పెట్టింది
అటువంటి రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కి 56 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల మధ్య నడుస్తుంది కాబట్టి వీటికి రాజధాని ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు. 1969 మార్చి ఒకటోతేదీన ప్రారంభమైన ఈ రైలు గరిష్ట వేగం 140 కిలోమీటర్లు. 24 గంటల సమయం పట్టే ప్రయాణాన్ని ఈ రైలులో ప్రయాణించడంద్వారా 17 గంటల్లో చేరుకోవచ్చు. రాజధాని ఎక్స్ ప్రెస్ వస్తోందంటే మిగతా రైళ్లన్నింటినీ ఆపేస్తారు. దేశానికే గర్వకారణమని రైల్వే అధికారులు ఘనంగా చెబుతారు. భద్రతా సౌకర్యాలు కూడా ఇందులో ఎక్కువే.

ప్రారంభంలో కేవలం తొమ్మిది బోగీలే
రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రారంభమైన సమయంలో కేవలం దీనికి తొమ్మిది బోగీలే ఉండేవి. తొలి రైలును పెరంబదూరులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ప్రారంభంలో కేవలం మూడు హాల్టింగ్స్ మాత్రమే ఇచ్చేవారు. ఇటీవలే వాటి సంఖ్యను పెంచారు. 1969లో రైలు ప్రారంభమైనప్పుడు స్లీపర్ క్లాస్ రూ.290 కాగా, చైర్ కార్ రూ.90గా ఉండేది. పూర్తి లోకోమోటివ్ ఇంజన్ తో నడిచే రాజధాని ఎక్స్ పెస్ ఇప్పటికీ పట్టాలపై శరవేగంగా పరుగులు తీస్తోంది. రాజధానికి క్రాసింగ్ ఇవ్వడం కోసం అన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా వివిధ స్టేషన్లలో నిలిపివేసి రాజధానినే ముందుగా పంపిస్తారు. దాని ప్రత్యేకత ఇదే.












Click it and Unblock the Notifications