ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. వీటిల్లో ఛార్జీలు సాధారణ రైలు ఛార్జీలకంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. అయితే ఎప్పుడెప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారనే విషయం చాలామందికి తెలియదు. అతికొద్ది మందికి మాత్రమే తెలుసుంటాయి. అలా కాకుండా సంవత్సరం పొడవునా వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.
వీటికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువమంది వలస పోతున్నారు? ఏ రాష్ట్రాలకు వెళుతున్నారు? ఎప్పుడు తిరిగివస్తున్నారు? తదితర విషయాలపై సర్వే చేసింది. కార్మికులు తమ సొంతూళ్లకు తిరిగి వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించింది. జనరల్ బోగీల్లో గంటల తరబడి ప్రయాణం చేస్తున్నారని, ఇది వారికి ఒకరకంగా శిక్షలాంటిదేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వీరిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయబోతున్న ప్రత్యేక రైళ్ల ల్లో స్లీపర్, జనరల్ బోగీలే ఉంటాయి.

ఏసీ బోగీలుండవు. 22 నుంచి 26 కోచ్ లు ఉండే అవకాశం ఉంది. దీనిపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అస్సాం, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వసల కార్మికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రైళ్లను శాశ్వత ప్రతిపాదికన నడపనున్నారు. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజువారీ రైళ్లపై రద్దీ ఒత్తిడి తగ్గుతుందంటున్నారు.












Click it and Unblock the Notifications