బిగ్ అలర్ట్: రూల్స్ మార్చిన ఇండియన్ రైల్వే
ప్రతి సంవత్సరం తన నియమ నిబంధనలను సరిచూసుకుంటూ, వాటిల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుంటూ వస్తోంది భారతీయ రైల్వే. తాజాగా ప్రయాణికులు రైళ్లల్లో నిద్రపోయే సమయానికి సంబంధించి గతంలో ఉన్న నిబంధనలను సవరించింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుడు స్లీపర్ లోకానీ, ఇతర రిజర్వేషన్ బోగీల్లోకానీ గరిష్టంగా తొమ్మిది గంటలు నిద్ర పోవడానికి అవకాశాన్ని కల్పించింది.
అయితే తాజాగా దాన్ని మార్చి ఎనిమిది గంటలుగా చేసింది. రాత్రి 9.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటలకు స్లీపర్, ఏసీ కోచ్ ల్లో నిద్రించవచ్చు. తాజాగా రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు మాత్రమే నిద్రించడానికి అవకాశం ఉంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడం కోసమే దీన్ని సవరించినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

లోయర్ బెర్త్ ల్లోని ప్రయాణికులు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.. మిడిల్ బెర్త్ ప్రయాణికులు త్వరగా పడుకుంటున్నారని, దీనివల్ల తాము అసౌకర్యంగా కూర్చోవాల్సి వస్తోందని, లేదంటే ఇష్టం లేకపోయినప్పటికీ నిద్రించాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు చేసేవారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే తాజాగా నిద్రించే సమయవేళలను మార్చింది. మిడిల్ బెర్త్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఎవరైనా ఇకనుంచి రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు నిద్రించడానికి అవకాశం ఉంది.
ఒకవేళ ముందుగానే పడుకోవాలంటే అందుకు లోయర్ బెర్త్ ప్రయాణికుల నుంచి అనుమతి పొందాల్సి ఉంది. రాత్రి 10.00 గంటల తర్వాతైతే ఈ అనుమతి అవసరంలేదు. ప్రయాణికుల సఖ్యతను బట్టి ఈ టైమింగ్స్ మార్చుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే 2017లో తొలిసారిగా ఈ నిబంధన తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications