ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఎన్ని గంటలో తెలుసా?
భారతదేశ తొలి బుల్లెట్ రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబయి వరకు బుల్లెట్ రైలు నిర్మాణ మార్గం జరుగుతోంది. వచ్చేఏడాది చివరకు పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ వెల్లడించారు. ఈ బుల్లెట్ రైలు నుంచి స్ఫూర్తి పొందిన భారతీయ రైల్వే తానే సొంతంగా బుల్లెట్ రైళ్ల తయారీకి పూనుకుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచే రెండు రైలు సెట్లను తయారుచేయబోతున్నారు. దీనికి సంబంధించి బిడ్లను కూడా రైల్వే ఆహ్వానించింది. ఇవి అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో, విశాఖపట్నంకు నాలుగు గంట్లలో చేరుకునే అవకాశం ఉంది.
బిడ్లను ఆహ్వానించిన భారతీయ రైల్వే
చెన్నైలోని ఐసీఎఫ్ లో వీటిని తయారు చేస్తారు. రైల్వేలను సాధ్యమైనంత వేగంగా అత్యాధునిక రవాణా సాధనంగా మార్చాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల మధ్య ఇవి పరుగులు తీస్తున్నాయి. పూర్తి హైస్పీడ్ రైళ్లను ప్రారంభించాలనే యోచనలోనే తాజాగా బిడ్లను పిలిచింది. ప్రస్తుతానికి రెండు సెట్లను తయారు చేస్తారు. వాటిని పరీక్షించిన తర్వాత ఏమైనా మార్పుచేర్పులు ఉంటే సరిచేసిన తర్వాత భారీసంఖ్యలో ఉత్పత్తి చేపడతారు. విదేశాలకు ఎగుమతి చేయాలనే యోచనలో కూడా భారతీయ రైల్వే ఉంది.

మొదటి ఏసీలో స్నానానికి వేడినీళ్లు
గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రెండు రైలు సెట్లను ఉక్కుతో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో రైళ్లు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని 250 కిలోమీటర్లకు పెంచుతున్నారు. ఈనెల మొదటివారంలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ బెంగళూరులో వందేభారత్ స్లీపర్ రైలు సెట్ ను ప్రారంభించారు. వీటిల్లో ఉన్న ఇంటరీయర్ కానీ, అత్యాధునిక సౌకర్యాలుకానీ అచ్చెరువొందిస్తున్నాయి. డిస్ ప్లే ప్యానెళ్లు, రైలు మొత్తం సెక్యూరిటీ కెమెరాలు, వికలాంగుల కోసం ప్రత్యేక బెర్తులు, అత్యాధునిక టాయిలెట్లు, మొదటి ఏసీలో స్నానం చేసేందుకు వేడినీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వందేభారత్ స్లీపర్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేసేందుకు హైదరాబాద్ కు చెందిన బీఈఎంఎల్ ముమ్మరంగా పనులు చేస్తోంది.












Click it and Unblock the Notifications