Redmi Turbo 5 లాంఛ్.. ఎంతంటే ???

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్‌లలో రెడ్‌మీ ముందంజలో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం షావోమీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను తీసుకొస్తుంది. తాజాగా భారత మార్కెట్లో కొత్త పవర్‌హౌస్‌ను పరిచయం చేసింది. గేమింగ్, మల్టీటాస్కింగ్, ప్రీమియం డిజైన్‌ను కోరుకునే యూజర్ల కోసం కంపెనీ REDMI Turbo 5 స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది.

అత్యాధునిక MediaTek Dimensity 8500-Ultra ప్రాసెసర్, 7540mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1.5K AMOLED డిస్‌ప్లే, 50MP OIS కెమెరా వంటి హైఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులు, పవర్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఫోన్ గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

redmi-newly-launched-smart-phone-turbo-5-5g-that-price-and-specifications-full-details-also-availabi

Redmi Turbo 5 ఫీచర్స్..

డిజైన్‌..

REDMI Turbo 5 మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో కెమెరాల చుట్టూ ప్రత్యేక RGB LED లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనిని కంపెనీ REDMI Pixel Matrixగా పిలుస్తోంది. గేమింగ్ సమయంలో, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఈ LED లైట్లు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.

డిస్‌ప్లే..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2756 x 1268 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2560Hz ఇన్‌స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్‌ను మరింత స్మూత్‌గా మార్చేందుకు ఈ డిస్‌ప్లే సహాయపడుతుంది. అదనంగా Dolby Vision, 3840Hz PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్, M10 ల్యూమినస్ మెటీరియల్ వంటి టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి. గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్ అందించగల ఈ డిస్‌ప్లే సూర్యరశ్మిలో కూడా స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass 7iను ఉపయోగించారు.

ప్రాసెసర్..

REDMI Turbo 5కు ప్రధాన ఆకర్షణ MediaTek Dimensity 8500-Ultra చిప్‌సెట్. 4nm టెక్నాలజీపై తయారైన ఈ ప్రాసెసర్ 20 లక్షలకు పైగా AnTuTu స్కోర్ సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో హెవీ గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులు ఎలాంటి ల్యాగ్ లేకుండా నిర్వహించవచ్చు.

స్టోరేజ్..

ఫోన్‌లో LPDDR5X Ultra RAM మరియు UFS 4.1 స్టోరేజ్ అందించారు. ఈ కాంబినేషన్ వల్ల యాప్‌లు వేగంగా ఓపెన్ కావడం, ఫైల్ ట్రాన్స్‌ఫర్ స్పీడ్ పెరగడం, మల్టీటాస్కింగ్ మరింత సులభమవుతుంది.

3D Ice-Loop కూలింగ్ సిస్టమ్..

గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 5300mm² VC కూలింగ్ సిస్టమ్‌తో కూడిన 3D Ice-Loop Cooling Technologyను అందించారు. అదనంగా Wildboost ఆప్టిమైజేషన్ టెక్నాలజీ గేమింగ్ ఫ్రేమ్‌రేట్లను స్థిరంగా ఉంచి మెరుగైన పనితీరును అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు..

REDMI Turbo 5 Android 16 ఆధారిత HyperOS 3పై పనిచేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల Android OS అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల దీర్ఘకాలం పాటు కొత్త ఫీచర్లు, భద్రతా నవీకరణలు అందుబాటులో ఉంటాయి.

కెమెరా..

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP Sony IMX882 ప్రధాన కెమెరాను అందించారు. దీనికి OIS (Optical Image Stabilization), EIS (Electronic Image Stabilization) సపోర్ట్ ఉంది. తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫోటోలు తీసేందుకు ఇది సహాయపడుతుంది. దీనికి తోడు 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కూడా అందించారు. ఫోన్ 4K 60fps వీడియో రికార్డింగ్కు మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇది 1080p 60fps వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి ఎంపికగా నిలవనుంది.

భారీ బ్యాటరీ..

REDMI Turbo 5లో 7540mAh భారీ బ్యాటరీను అమర్చారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే రోజంతా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా వినియోగాన్ని సులభంగా నిర్వహించగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అదనంగా 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇతర గ్యాడ్జెట్లను కూడా ఈ ఫోన్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. 100W PPS ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్కు కూడా మద్దతు ఉంది.

IP69K రేటింగ్‌తో సూపర్ ప్రొటెక్షన్..

REDMI Turbo 5కు IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉన్నాయి. దీంతో ఈ ఫోన్ ధూళి, నీటి చినుకులు, నీటిలో మునిగిపోవడం, అధిక పీడన నీటి జెట్‌ల నుంచి కూడా రక్షణ పొందుతుంది. ఇది అత్యంత బలమైన డ్యూరబిలిటీ ఫీచర్లలో ఒకటిగా చెప్పవచ్చు.

కనెక్టివిటీ ఫీచర్లు..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో Dual 5G, Wi-Fi 7, Bluetooth 6.0, NFC, NavIC, USB Type-C పోర్ట్, స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. USB Type-C ద్వారా ఛార్జింగ్‌తో పాటు ఆడియో సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది.

రంగులు..

REDMI Turbo 5 Asphalt Black, Nitro Blue, Turbo White రంగుల్లో అందుబాటులోకి రానుంది.

ధరలు..

8GB + 256GB వేరియంట్ - రూ.37,999
12GB + 256GB వేరియంట్ - రూ.40,999

విక్రయాలు & లాంచ్ ఆఫర్లు..

ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 19 నుంచి Amazon, Mi.com, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలకు అందుబాటులోకి రానుంది. లాంచ్ ఆఫర్ల కింద SBI, ICICI, Axis బ్యాంక్ కార్డులపై రూ.2,000 వరకు తక్షణ డిస్కౌంట్, 9 నెలల వరకు నో-కాస్ట్ EMI, 60 శాతం వరకు అష్యూర్డ్ బైబ్యాక్ విలువను కంపెనీ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+