డిసెంబరు 1 నుంచి మారిన రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్

దేశవ్యాప్తంగా 1.30 లక్షల నెట్ వర్క్ తో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచిన భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు తన నియమ నిబంధనలను మారుస్తూ ఉంటుంది. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా వాటిని తీసుకువస్తుంటుంది. తాజాగా ఈనెల ఒకటో తేదీ నుంచి టికెట్ల బుకింగ్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైల్వేకు సంబంధించిన అధికారిక ఐఆర్ సీటీసీ యాప్స్ తోపాటు, ప్రయివేటు టికెట్ బుకింగ్ యాప్స్ ద్వారా రెండు గంటలు ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో కంటే రెండు గంటలు అదనంగా ఇచ్చారు.

రెండు గంటలు పెరిగిన సమయం
గతంలో ఉదయం పదిగంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం ఉండగా కొత్తగా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్ల బుకింగ్స్ కు సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. ఇవి మాములుగానే ఉన్నాయి. అలాగే క్యాన్సిలేషన్ ఛార్జీల్లో కూడా మార్పులు చేయలేదు. IRCTC యాప్, సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే అతి తక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా ప్రయివేటు యాప్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువగా పడుతున్నాయి. కన్వీనియన్స్ ఫీజు, ఏజెంట్ సర్వీస్ ఛార్జ్, పేమెంట్ గేట్‌ వే ఛార్జీలాంటివి చెల్లించాల్సిన అవసరం లేదు.

Indian Railways ticket booking rules have changed from December 1

ప్రయివేటు యాప్స్ ద్వారా టికెట్లు
ఇలాంటి సమయంలో వాటికి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ప్రయివేటు కంపెనీ యాప్స్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. వీరందరినీ ఐఆర్ సీటీసీవైపు మళ్లించాలనే లక్ష్యంతో రైల్వే బోర్డు ఉంది. వీటిద్వారా టికెట్ బుక్ చేసుకుంటే వీటికి, ఐఆర్ సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్ కు రూ.150 వరకు తేడా ఉంటోంది. వీటిద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం అనేది తేలికగా ఉంటోందికదా అనే ఉద్దేశంతో చాలామంది ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. ఐఆర్ సీటీసీ యాప్ లో క్యాప్చా నమోదు చేసే సమయంలో తప్పులు పడుతుండటంతో సమయం ఎక్కువగా పడుతోంది. అయితే ఐఆర్ సీటీసీ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఎంత సౌలభ్యం ఉంటుంది, ఎంత నగదు మిగులుతుంది అనే విషయాలపై ప్రయాణికుల్లో అవగాహన తీసుకొచ్చేందుకు రైల్వేబోర్డు చర్యలు తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+