TTD: శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్ - తిరుపతికి నేరుగా, పునః ప్రారంభం..!!

Tirumala: తిరుమల దర్శనం కోసం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో రద్దీ కొనసాగు తోంది. వైకుంఠ ద్వార దర్శనాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుతున్నాయి. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా.. తిరుపతికి వెళ్లేందుకు ప్రయాణీకులకు కొత్తగా మరో వెసులుబాటు కలిగింది. ఇప్పటికే రైళ్లు.. విమానాలు.. బస్సులు నిత్యం రద్దీగా మారటంతో.. తాజా నిర్ణయం తిరుపతి ప్రయాణీకులకు ప్రయోజనకరం కానుంది.

తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. రైళ్లు.. బస్సులు.. విమానాల ద్వారా పలు ప్రాంతాల నుంచి తిరుపతి చేరుకుంటున్నారు. కాగా, తిరుపతికి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వందేభారత్ నడుపుతున్నారు. త్వరలోనే వందేభారత్ స్లీపర్ సైతం అందుబాటులోకి రానుంది. కాగా.. దేశ వ్యాప్తంగా పలు నగరాల నుంచి తిరుపతికి వస్తున్న విమానాలకు డిమాండ్ పెరుగుతోంది.

Indigo new service from Hyderabad to Tirupati launched Schedule details here

దీంతో.. సర్వీసుల పెంపు పైన విమానయాన సంస్థలు ఫోకస్ చేసాయి. అందులో భాగంగా హైదరాబాద్-తిరుపతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇండిగో సంక్షోభం క్రమంలో డిసెంబర్ 18 నుంచి ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ తిరిగి ఈ సర్వీసు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఈ విమానం టైమింగ్స్ ను వెల్లడించింది.

కాగా, ఈ విమానం మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 3.05 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు బయల్దేరుతుంది. మళ్లీ ఈ విమానం మొదలుకావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ప్రయోజనం కలగనుంది. గత నెలలో చోటు చేసుకున్న ఇండిగో సంక్షోభం వేళ దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమానాలను సంస్థ రద్దు చేసింది.

కేంద్రం సీరియస్ కావటంతో తిరిగి సర్వీసులను దశల వారీగా క్రమబద్ధీకరించింది. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్-తిరుపతి విమానాలను కూడా పున:రుద్దరించింది. దీని ద్వారా హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ జిల్లాల నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు ఈ నిర్ణయం వెసులుబాటుగా మారనుంది. ఇక, టీటీడీ సైతం దర్శనం మరింత సులభంగా అందించేందుకు కొత్త నిర్ణయాల పైన కసరత్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+