పాలకొల్లులో మహిళల తాళిబొట్లతో వినూత్న నిరసన; రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన టీడీపీ ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటుసారా జే బ్రాండ్ మద్యం నిషేధించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మద్యపాన నిషేధం విధించాలంటూ ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీ వేదికగా టిడిపి ఎమ్మెల్యేలు చేసిన పోరాటానికి మద్దతుగా గ్రామస్థాయి నుంచి ఆందోళనలకు టీడీపీ శ్రేణులు శ్రీకారం చుట్టారు.

నెల్లూరులో టీడీపీ ఆందోళన.. జగన్ పై మండిపాటు
రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఆందోళనలు కొనసాగాయి. నెల్లూరు జిల్లాలో నాసిక మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు పేరుతో తొమ్మిది రకాలుగా నాసిరకం మద్యం అమ్మకాలు జరుపుతున్నారని వారు మండిపడ్డారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మందుబాబుల ఇళ్లను సీఎం జగన్ దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లాలో టీడీపీ ఆందోళనలో ఉద్రిక్తత
విజయనగరం జిల్లా పార్వతీపురం లో సారా మహమ్మారిపై నిరసన తెలియజేస్తున్న టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సారా మహమ్మారికి నిరసనగా ప్రభుత్వ తీరుపై ర్యాలీ చేపట్టిన టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు టిడిపి నాయకులను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

గుంటూరు, విజయవాడలలో మద్యం దుకాణాల ముందు టీడీపీ ఆందోళన
అంతేకాదు గుంటూరు జిల్లాలోని పాత గుంటూరు లో ఎన్టీఆర్ కూడలిలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద టిడిపి నేతలు ఆందోళనకు దిగారు .జంగారెడ్డిగూడెంలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జే బ్రాండ్స్ పోవాలి జగన్ రెడ్డి దిగిపోవాలి అంటూ టిడిపి నేతలు నినాదాలు చేశారు. కృష్ణాజిల్లాలోని టిడిపి నేతల ఆందోళన కొనసాగింది. విజయవాడలో ప్రభుత్వ మద్యం దుకాణం ఎదుట మహిళలు ఆందోళన చేశారు. నందిగామ లోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద తంగిరాల సౌమ్య ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిరసన తెలియ చేసిన మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో నిరసన ర్యాలీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలోని మోరంపూడి జంక్షన్ వద్ద టిడిపి శ్రేణులు నిరసన చేపట్టారు. నిరసనలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. కల్తీ నాటుసారా విక్రయాలను, జే బ్రాండ్స్ మధ్యనే నిషేధించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
తాళిబొట్లను చేతిలో పట్టుకుని నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన
అమ్మఒడి ఇచ్చి జె-బ్రాండ్స్ తో నాన్న లేకుండా చేస్తున్నావు అంటూ జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు మహిళలు తాలిబన్లతో నిరసన వ్యక్తం చేస్తూ నాసిరకం బ్రాండ్స్ బ్రాందీ సీసాలను ధ్వంసం చేశారు. కల్తీసారాను మించిన విషయం జె బ్రాండ్స్ రూపంలో బ్రాందీ షాపులలో అమ్ముతున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జగన్ ధన దాహానికి తాళిబొట్లు తాకట్టు పెట్టడమే కాదు తెగిపోతున్నాయి అని ఆయన మండిపడ్డారు.

గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చినట్లు సారా మరణాలను సహజ మరణాలుగా: నిమ్మల ఫైర్
ఎన్నికలకు ముందు మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చి, నేడు మద్యం ఏరులై పారిస్తున్నారంటూ నిమ్మల రామానాయుడు అసహనం వ్యక్తం చేశారు. గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చినట్లు సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జే బ్రాండ్స్ మద్యాన్ని నిషేధించాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications