మూడు రాజధానులతో అస్తిరత్వం , భవిష్యత్ తరాల నాశనం : అశోక్ గజపతిరాజు
ఏపీలో రాజధానిపై టెన్షన్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక ఈ నేపధ్యంలో రాజధాని విషయంలో జగన్ మూడు రాజధానులను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ను ఏర్పాటు చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
ఇక విజయనగరం టీడీపీ నేత అశోక్ గజపతిరాజు రాజధాని విషయంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు . రాజధానిని మూడు ముక్కలు చేస్తే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదన్నారు . ఒక రాష్ట్రానికి మూడు రాజధానులనడం అస్థిరత్వానికి దారి తీస్తుందని అశోక్ గజపతి రాజు హెచ్చరించారు. భవిష్యత్ తరాలను నాశనం చేసేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలుగు ప్రజల భవిష్యత్ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక తెలుగు భాష, సంస్కృతి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ , టీడీపీ నిలిచిపోతాయని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు భాషకు , ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఇక రాజధాని అమరావతి విషయంలో జగన్ నిర్ణయం తప్పని పేర్కొన్న ఆయన అమరావతి కోసం రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, భూమిని త్యాగం చేసిన రైతులు ఈ దుస్థితిని ఎదుర్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications