మూలపేటలో ఇంటిగ్రేటెడ్ కెమికల్ పార్క్.. రూ.3000 కోట్లతో ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్‌!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా మూలపేట ప్రాంతాన్ని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మార్చే దిశగా మరో ముఖ్యమైన అడుగు వేసింది. మూలపేట పోర్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ కెమికల్ పార్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నిర్ణయించింది. ఈ నెలలోనే అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించనున్నారు.

ప్రభుత్వం ప్రాథమికంగా ఈ పార్క్‌ను దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పార్క్‌లో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏపీఐఐసీ సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 'భవ్య రసాయన' పథకం కింద రూ.1,000 కోట్లు గ్రాంట్‌గా అందించనుంది. మూలపేట ఓడరేవుతో అనుసంధానంగా ఈ పార్క్ రూపొందుతోంది కాబట్టి ముడి పదార్థాల దిగుమతి, ఉత్పత్తుల ఎగుమతి సులభతరం కానుంది.

Integrated Chemical Park at Moolapeta AP to Develop Integrated Chemical Park at Mulapeta Master Plan Underway by APIIC

ఓడరేవులో వాణిజ్య కార్యకలాపాలు 2026 డిసెంబర్ నాటికి ప్రారంభం కావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కెమికల్ పార్క్‌లో ప్రధాన యాంకర్ యూనిట్‌గా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థకు 450 ఎకరాల భూమి కేటాయించింది. రూ.2,250 కోట్ల పెట్టుబడితో ఫాస్ఫోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, జిప్సం ప్లాస్టర్, ఎరువులు తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.

రోజుకు 2,000 టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్, 650 టన్నుల ఫాస్ఫోరిక్ యాసిడ్, 1,000 టన్నుల జిప్సం ప్లాస్టర్ ఉత్పత్తి లక్ష్యం. ప్రత్యక్షంగా 400 మందికి ఉపాధి కల్పించనున్నారు. 2030 అక్టోబర్ నాటికి ఈ యూనిట్ పూర్తి స్థాయిలో పనిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. స్థానిక యువతకు ఉపాధి, వాణిజ్యం, రవాణా రంగాల్లో అదనపు అవకాశాలు రానున్నాయి.

మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 2,001 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి కూడా వేగంగా సాగుతోంది. దీనికి మొత్తం రూ.1,876.66 కోట్లు ఖర్చు కానుంది. కేంద్ర ఔషధాల శాఖ రూ.1,000 కోట్లు గ్రాంట్‌గా ఇస్తుండగా, మిగతా మొత్తాన్ని ఏపీఐఐసీ భరిస్తుంది. మొదటి దశలో రూ.546.77 కోట్లతో ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

డిసెంబర్ లో తెలంగాణాకు ప్రధాని మోదీ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు కీలకప్రాజెక్టులు ప్రారంభం!
డిసెంబర్ లో తెలంగాణాకు ప్రధాని మోదీ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు కీలకప్రాజెక్టులు ప్రారంభం!

ఏపీఐలు, ఫెర్మెంటేషన్ జోన్లు, ఆర్ అండ్ డీ ల్యాబ్‌లు, ఇంక్యుబేషన్ హబ్, వ్యర్థాల శుద్ధి యూనిట్, లాజిస్టిక్స్ టెర్మినల్స్ ఉంటాయి. 2027 జూన్ నాటికి మొదటి దశ పూర్తి చేసి కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యం. ఈ పార్క్ ద్వారా రూ.11,542 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 2033 నాటికి సుమారు 27,360 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని అంచనా.రెండు పార్కుల కలయికతో మొత్తం రూ.3,376 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, రూ.60,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+