ఏపిలో ఇంటర్ ఫలితాలు విడుదల : పలితాల కోసం ఇక్కడ ఇలా....!
Recommended Video

ఏపిలో ఇంటర్మీడియెట్ రీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల ను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. సెంకడియర్‌లో 72 శాతం మంది ఉత్తీ ర్ణులయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో నిలిచారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలను విడుదల చేసారు.

తొలి సారి గ్రేడింగ్ విధానంలో..
ఏపిలో తొలి సారి గ్రేడింగ్ విధానంలో ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసారు. మొది, రెండో సంవత్సరం ఫలితా లనున ఒకే దఫా అధికారులు విడుదల చేసారు. ఈసారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఫస్టియర్ ఫలితాల్లో 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండవ సంవత్సరం పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి..రెండవ సంవత్సర ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 81 శాతం, రెండో సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. గ్రేడింగ్ విధానంలో భాగంగా మొత్తం గా 13,966 మందికి పది కి పది శాతం గ్రేడింగ్ దక్కింది. ఈ పరీక్షల్లో 75 శాతం బాలకలు ఉత్తీర్ణత సాధించినట్లుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయ లక్ష్మీ స్పష్టం చేసారు. కాగా, మే 14న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇంటర్ ఫలితాల కోసం కింద ఉన్న ఈ లింక్ ను క్లిక్ చేయండి:












Click it and Unblock the Notifications