యనమల, ఆశోక్‌గజపతి మధ్య సంభాషణతో నవ్వులే నవ్వులు
అమరావతి: విజయవాడలో జరుగుతున్న టిడిపి వర్క్‌షాప్‌లో మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సరదా వ్యాఖ్యలతో నవ్వులు విరిశాయి. గంభీర వాతావరణమంతా అందరూ నవ్వులతో ఆహ్లదంగా మారింది.
విజయవాడలో జరుగుతున్న టిడిపి వర్క్‌షాప్‌లో మిషన్ 2019 లక్ష్యంగా నేతల ప్రసంగాలు సాగాయి. సీరియస్‌గా సాగుతున్న ఈ వర్క్‌షాప్‌లో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలతో నవ్వులు విరిశాయి.

టీడీపీ వర్క్ షాప్ కు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రాగానే..రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఆయన్ని యనమల కోరారు. దీంతో, తన వద్ద డబ్బు లేదని, రూ.200 నోటును ఇటీవలే చూశానని అశోక్ గజపతి రాజు సమాధానమిచ్చారు. అయితే, ఇలాంటి నోట్లు ఎన్ని ఉంటే అన్నీ రాష్ట్రానికి ఇచ్చేయాలని యనమల వ్యాఖ్యానించడంతో నవ్వులు విరిశాయి.
కాగా, కొత్తగా విడుదలైన రూ.200 నోటును టీడీపీ నేతలందరూ ఆసక్తిగా తిలకించారు. యనమల పక్కనే కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూర్చుని ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులంతా అక్కడే ఉన్నారు. యనమల, ఆశోక్‌గజపతిరాజుల మధ్య సరదా సంభాషణలతో వర్క్‌షాప్‌లో నవ్వులు విరిశాయి.












Click it and Unblock the Notifications