ఎన్నికల వేళ ఆలీ కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ నుంచి పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నుంచి ప్రచారం చేసే ముఖ్యుల పైన చర్చ మొదలైంది. ఎన్డీఏ కూటమిగా మూడు పార్టీల నుంచి పలువురు ప్రచారంలోకి దిగనున్నారు. వైసీపీ నుంచి స్టార్ క్యాంపెయినర్ గా జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఇదే సమయంలో సినీ నటుడు ఆలీ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
హోరా హోరీ పోరు
ఏపీలో ఎన్నికల ప్రచార వేడి క్రమేణా పెరుగుతోంది. సీఎం జగన్ కడప జిల్లా నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరు నుంచి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి. టీడీపీ నుంచి చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ప్రచారం చేయనున్నారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, పురందేశ్వరి ప్రచారంలో పాల్గొంటారు. వైసీపీ నుంచి మాత్రం జగన్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్ గా కనిపిస్తున్నారు.

ప్రచారంలో ముఖ్యులు
2019 ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు వైసీపీ కోసం ప్రచారం చేసారు. కానీ, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారుతోంది. వైసీపీ నుంచి ప్రస్తుతం రోజా నగరి నుంచి, నందమూరి బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక, సినీ నటుడు ఆలీ వైసీపీ ప్రభుత్వంలో సలహాదారు పోస్టు దక్కించుకున్నారు. వైసీపీ నిర్వహించిన సామాజిక న్యాయ యాత్రలో పాల్గొని జగన్ నిర్ణయాల పైన అనుకూల ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆలీకి సీటు ఖాయమని ప్రచారం సాగింది. తనకు పోటీ చేసే అవకాశం దక్కుతుందని, తనకు త్వరలోనే సమాచారం వస్తుందని ఆలీ స్వయంగా తన పోటీ పైన ఆశతో కనిపించారు. కానీ, ఆలీకి సీటు దక్కలేదు.

ఆలీ నిర్ణయం ఏంటి
దీంతో, ఇప్పుడు ఆలీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సీటు రాని కారణంగానే వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఆలీ పాల్గొనటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక దశలో ఆలీకి నంద్యాల ఎంపీ లేదా, మరో చోట నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది. ఆలీకి సీటు దక్కకపోవటంతో కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. దీంతో..వైసీపీ కోం పని చేసిన ఆలీకి సీటు ఇవ్వకపోవటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మైనార్టీ వర్గాలకు వైసీపీ ఏడు స్థానాలు కేటాయించింది. ఆలీకి భవిష్యత్ పదవి పైన జగన్ నుంచి హామీ ఉందనేది మరో వాదన. దీంతో, ఇప్పుడు ఆలీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications