ఆ ఊర్లోని వారు ఆస్పత్రికి వెళ్తే శవంగానే తిరిగి వస్తున్నారా.. ఐదు నెలల్లో 28 మంది !
దాదాపు 3 వేల మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. గత ఐదు నెలల కాలంలోనే 28 మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జ్వరం, కీళ్ల నొప్పులు, బలహీనత వంటి లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లినవారు.. తిరిగి ఇంటికి వస్తారా అనే అనుమానాలు అందరినీ హడలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అలా వెళ్ళిన వారిలో దాదాపు ఇంటికి మృతదేహాలుగా తిరిగి వస్తే.. కోలుకుని ఇంటికి వచ్చిన అతి కొద్ది మంది కూడా కొన్ని రోజుల తర్వాత మృత్యువాత పడ్డారు. గత రెండు నెలలలోనే ఏకంగా 20 మంది చనిపోవడంతో అసలు ఆ ఊరిలో ఏం జరుగుతోందని తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషాద గాధ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో చోటు చేసుకుంది.
మిస్టరీ వెనుక కారణాలు ఏంటి?
ఈ వరుస మరణాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీఎంఈ డాక్టర్ రఘునందన్ నేతృత్వంలోని ప్రత్యేక వైద్య బృందం తురకపాలెం గ్రామానికి చేరుకొని పరిశీలన ప్రారంభించింది. ఎపిడిమిక్ సెల్, గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన మైక్రో బయాలజీ, ఎస్‌పిఎం వైద్యులు సహా అనేక నిపుణులు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాల నుంచి రక్తనమూనాలు సేకరించారు.

అలానే గ్రామంలోని నీటి నమూనాలు కూడా సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. కాగా వరుస మరణాలకు దోమకాటు కారణమా ? కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియా కారణమా ?? లేక మరేదైనా రహస్యం ఈ మరణాలకు కారణమా అని విచారణ చేస్తున్నారు. చనిపోయిన వారిలో కొందరికి దోమ కాటు వచ్చిన చోట బొబ్బలు వచ్చాయని కుటుంబాలు చెబుతున్నాయి. అలానే చనిపోయిన వారిలో కొందరికి చీప్ లిక్కర్ అలవాటు కూడా ఉన్నట్లు బయటపడింది. అయితే ప్రాథమిక పరిశీలనలో వైరల్ లేదా బ్యాక్టీరియల్ జ్వరాలు కారణం కాదని వైద్య బృందాలు వెల్లడించాయి.
మెలియాయిడోసిస్ ముప్పు..
గ్రామంలో ఇప్పటికే ఇద్దరు ప్రమాదకరమైన మెలియాయిడోసిస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడ్డారని రిపోర్టులు చెబుతున్నాయి. వారిలో ఒకరు మరణించగా.. మరొకరు చికిత్సతో బయటపడ్డారు. ఈ వ్యాధి గాలి, నీరు, నేల ద్వారా వ్యాపించే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.
అయితే గ్రామస్తుల ప్రకారం.. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు ఒక్కసారిగా జ్వరం, బలహీనత, చర్మంపై బొబ్బలు వచ్చి కుప్పకూలిపోతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోతుందని బాధితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాగా చనిపోయిన వారిలో ఎక్కువమంది పురుషులే అని.. వారిలో 65 ఏళ్లు దాటిన వారు ఆరుగురు ఉండగా, మిగతా వారు 60లోపే ఉన్నారని తెలుస్తోంది.
ఇక రక్తనమూనాలు, నీటి నమూనాల పరీక్ష ఫలితాలు రాబోయే వెలువడితే అసలైన కారణం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. అప్పుడైన తురకపాలెంలో ఈ వరుస మరణాలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications