వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఉక్కు కోసం ప్రధాని మోడీకి లేఖ రాసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

సీబీఐ మాజీ జేడీ, రాజకీయాల్లో నేను సైతం అంటూ ముందుకు వచ్చి గత ఎన్నికల్లో జనసేన తరపున బరిలోకి దిగి ఓటమిపాలైన నేత లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ పై తన స్పందన తెలియజేశారు. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కు లేని ప్రత్యేకత విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉందని పేర్కొన్న సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు కోసం ఎంపీలు , ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్, బీజేపీ, పవన్ స్పందించాలి : గంటా శ్రీనివాస్విశాఖ ఉక్కు కోసం ఎంపీలు , ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్, బీజేపీ, పవన్ స్పందించాలి : గంటా శ్రీనివాస్

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

ఎగుమతి దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా విశాఖను పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశామని స్పష్టం చేశారు. లేఖలో కొన్ని ప్రధానమైన సూచనలు చేశామని ఆ సూచనలు అమలు చేస్తే మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావచ్చని మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కు ని తిరిగి లాభాల్లోకి తీసుకురావచ్చని చెప్పిన లక్ష్మీనారాయణ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని సూచించారు.

దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడవలసిన అవసరం

దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడవలసిన అవసరం

దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడవలసిన అవసరం ఉందని వివి లక్ష్మీనారాయణ తెలిపారు.

మొదటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రానున్న కాలంలో స్టీల్ కు డిమాండ్ పెరగనుందని స్వయంగా స్పష్టం చేశారని పేర్కొన్నారు లక్ష్మీనారాయణ. ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో దేశానికి రెండో స్థానం అని చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్టీల్ పరిశ్రమలను ప్రైవేటీకరించడం చేస్తే సిమెంట్ పరిశ్రమలకి పట్టిన గతే పడుతుంది అంటూ వ్యాఖ్యానించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక అనేక మంది ప్రాణత్యాగాలున్నాయన్న లక్ష్మీ నారాయణ

విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక అనేక మంది ప్రాణత్యాగాలున్నాయన్న లక్ష్మీ నారాయణ

భవిష్యత్ రోజుల్లో స్టీల్ కొనడం కష్టంగా మారుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ విగ్రహానికి 3200 టన్నులు , అటల్ టన్నెల్ కోసం 2200 టన్నులు విశాఖ స్టీల్ ప్లాంట్ నుండే పంపించారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి ఉత్పత్తి అవుతున్న స్టిల్ నాణ్యమైనదని ఆయన స్పష్టం చేశారు . విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక అనేక మంది ప్రాణ త్యాగాలు ఉన్నాయని పేర్కొన్న సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ, తన చిన్నతనంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం గురించి చెప్పుకుంటే విన్నామని తెలిపారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల గుండెచప్పుడు.. దీనిని భిన్నంగా చూడాలి

విశాఖ ఉక్కు ఆంధ్రుల గుండెచప్పుడు.. దీనిని భిన్నంగా చూడాలి

విశాఖ ఉక్కు ఆంధ్రుల గుండెచప్పుడు అని, దీనిని మిగతా సంస్థలతో కలిసి చూడకుండా భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరించకుండా కేంద్రం విశాఖ ఉక్కు ను తన చేతుల్లోనే ఉంచుకుంటే మంచిది అని సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు .

ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆందోళనలు కొనసాగుతున్న వేళ వీవీ లక్ష్మీ నారాయణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పటం ఆసక్తికరంగా మారింది.

English summary
English description Former CBI JD Lakshminarayana said that the Vizag plant has specialties that no other steel plant in our country has. He said the plant could be brought back into profit with minor changes. To this end, he wrote a letter to Prime Minister Modi. The letter stated that the plant did not need to be privatized. He said that Visakhapatnam Steel was the heartbeat of Andhra Pradesh and it needed to be looked at differently than other companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X