రఘురామ- ఐపీఎస్ అధికారి కేసులో అనూహ్య పరిణామం
బీహార్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయనను ఏపీ పోలీసులకు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి పాట్నా కోర్టు నిరాకరించింది. సరైన పత్రాలు లేకపోవడం, ప్రక్రియలో లోపాలను కారణంగా చూపుతూ ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. 2024లో ఏపీలో దాఖలైన ఓ ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు ఉండటం ఆయన అరెస్టుకు కారణమైంది.
2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. ఏపీలో ఇంటర్ కేడర్ డెప్యుటేషన్‌పై పనిచేశారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో బీహార్ ఫైర్ అండ్ హోం గార్డ్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2021లో తనను అరెస్ట్ చేసి, కస్టడీలో హింసించారని, హత్యాయత్నం చేశారని, అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు, ఇప్పటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వారిపై ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 307 కింద సునీల్ నాయక్ సహా మరికొందరు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం సునీల్ నాయక్ తన మాతృ రాష్ట్రానికి తిరిగివెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయన కోసం చేయడానికి ఏపీ పోలీసులు బీహార్ వెళ్లారు. సోమవారం తెల్లవారు జామున 6 గంటల సమయంలో నాయక్‌ను ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న పలువురు హోమ్ గార్డులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా నాయక్ నివాసం వద్ద నిరసన తెలిపారు. పాట్నా ఈస్ట్ సిటీ ఎస్పీ భాను ప్రతాప్ సింగ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. ఈ సంఘటన గురించి పాట్నా పోలీసులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో హైకోర్టు దీనిని ప్రక్రియ లోపంగా పరిగణించిందని చెప్పారు.
కేసు డైరీ లేదా వారెంట్ లేకుండా ఏపీ పోలీసులు రావడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని భాను ప్రతాప్ తెలిపారు. ఈ కారణాలతో కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ దరఖాస్తును తిరస్కరించిందని, తదుపరి చర్యలు ఏమిటనేది ఏపీ పోలీసులు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications