విజయవాడ ప్రజలకు మాత్రమే!

పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వెళ్లే యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ప్రత్యేక రైలును నడపనుంది. 12 రాత్రులు, 13 పగటి వేళలుంటాయి. నవంబరు 18వ తేదీన విజయవాడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, ఉజ్జయిని, ద్వారక(నాగేశ్వర్), సోమనాథ్, భీమ్ శంకర్, నాసిక్, ఔరంగాబాద్ తదితర జ్యోతిర్లింగ ప్రాంతాలను సందర్శించవచ్చు.

30న తిరుగు ప్రయాణం : 30వ తేదీన రైలు తిరుగు ప్రయాణమవుతుంది. హోటల్స్ లో ఏసీ గదులు, నాన్ ఏసీ గదులు, టీ, టిఫిన్, భోజనం, రవాణాతో కలిపి స్లీపర్ టికెట్ రూ.21వేలు, థర్డ్ ఏసీలో రూ.2,500, సెకండ్ ఏసీలో రూ.42,500 ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం ఉంది. టికెట్ల బుకింగ్ కు, ఇతర వివరాలకు సంస్థ వెబ్ సైట్ తోపాటు 8287932312 నెంబరులో సంప్రదించాలి.

irctc jyothirlinga tour from vijayawada

కాలంతోపాటు మార్పు : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన, అధునాతన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఇవి 34 మార్గాల్లో 68 ట్రిప్పులు వేస్తున్నాయి. సెమీ హైస్పీడ్ రైళ్లుగా ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. అధునాతన సౌకర్యాలను సమకూర్చడంతో క్లాస్ రైళ్లుగా పేరు తెచ్చుకున్నాయి.

ప్రయాణికుల నుంచి ఆదరణ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖ, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి రేణిగుంట మీదగా చెన్నై, కాచిగూడ నుంచి బెంగళూరు వరకు నడుస్తున్నాయి. ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదు మినహా ఈ రైళ్లు ప్రయాణికుల ఆదరణను బాగా దక్కించుకున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+