చాలా తక్కువలో ఊటీకి IRCTC ప్యాకేజీ

'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్'పేరుతో IRCTC జూన్ 27వ తేదీ వరకు అందుబాటులో ఉండేలా ఒక ప్యాకేజీ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి రైలు పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగే ఈ యాత్రకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మే నెలలో 2, 9, 16, 23, 30 తేదీలు.. ఇలా జూన్ 27వ తేదీ వరకు తీసుకోవచ్చు.

మొదటి రోజు: ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరుతుంది. శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.17230) ఎక్కాలి.
రెండోరోజు : ఉదయం 8.00 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి చేరుకుంటారు. హోటల్ వసతి ఉంటుంది. సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు చూడొచ్చు. రెండో రోజు ఊటీలోని హోటల్ రూమ్‌లో బస.

ooty1

మూడో రోజు: ఉదయం అల్పాహారం తర్వాత, దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం చూడొచ్చు. ఆ తర్వాత పాయికర జలపాతాన్ని సందర్శిస్తారు. దీంతో మూడో రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రికి మళ్లీ అదే హోటల్‌లో బస ఉంటుంది.

నాలుగో రోజు: ఉదయం అల్పాహారం తర్వాత ఊటీ సమీప ప్రాంతంలో పర్యటన ఉంటుంది. రాత్రిపూట మళ్లీ హోటల్‌లో బస చేయడంతో నాలుగో రోజు పర్యటన ముగుస్తుంది.

ఐదో రోజు: అల్పాహారం చేసిన తర్వాత..మధ్యాహ్నం హోటల్ గదిని ఖాళీ చేయాలి. ఊటీ నుండి కోయంబత్తూర్ వస్తారు. సాయంత్రం 4:35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతారు.

ఆరో రోజు: మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ వివరాలు
సింగిల్ షేరింగ్ ఒక్కొక్కరికి రూ. 31,410
డబుల్ షేరింగ్ ఒక్కొక్కరికి రూ.17,670
ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒకొక్కరికి రూ. 14,330
5-11 సంవత్సరాల మధ్య పిల్లలకు రూ.7650 చెల్లించాలి.
మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాన్ని యాత్రికులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అల్పాహారం బండిలో తీసుకువెళ్లడం వరకు ప్యాకేజీ కిందకు వస్తాయి. గైడ్ ను కూడా యాత్రికులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+