ప్యాకేజ్ అదిరిపోయింది... ఎంతేంటి?
irctc నుంచి అదిరిపోయే ప్యాకేజ్ అందుబాటులోకి వచ్చింది. ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటిని చుట్టేసి రావచ్చు. సికింద్రాబాద్ నుంచి అక్టోబరు 12న యాత్ర ప్రారంభమవుతుంది. 9 రాత్రులు, 10 రోజులు ఉంటుంది. మొత్తం మూడు కేటగిరిలు ఏర్పాటు చేశారు. ఎకానమీ కేటగిరిలో డబుల్/ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 16,400 కాగా స్టాండర్డ్ కేటగిరి ధర రూ. 25,500గా నిర్ణయించారు.
డబుల్/ ట్రిపుల్ షేరింగ్‌కు ఇది వర్తిస్తుంది. కంఫర్ట్ కేటగిరి అయితే రూ. 33,300గా ఉంది. ఇది కూడా డబుల్/ ట్రిపుల్ షేరింగ్‌కు వర్తిస్తుంది. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయసు లోపు చిన్నారులకు రూ.15,200 తీసుకుంటున్నారు. కేటగిరి ఆధారంగా ధర మారుతుంటుంది. టూర్‌లో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్య క్షేత్రాలను చూడొచ్చు. జగన్నాథ టెంపుల్, సన్ టెంపుల్, బీచ్, విష్ణు పాద టెంపుల్, కాశీ విశ్వనాథ టెంపుల్, అన్నపూర్ణ దేవీ టెంపుల్, గంగా హారతి, రామ జన్మ భూమి, సరయు నది, త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్ ప్రదేశాలను దర్శించవచ్చు. ఖాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు , రాజమండ్రి , సామర్లకోట, పెందూర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో కూడా రైలు ఎక్కొచ్చు.

టూర్ ప్యాకేజ్‌లో భాగంగా ట్రైన్ జర్నీ టికెట్లు, రాత్రి బస, వాష్ అండ్ కేంజ్, ట్రాన్స్‌పోర్ట్ కల్పిస్తారు. మార్నింగ్ టీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కూడా టూర్ ప్యాకేజ్‌లో భాగంగానే అందుతాయి. రవాణా బీమా ఉంది. ట్రైన్‌లో సెక్యూరిటీ, టూర్ ఎస్కార్ట్స్ కూడా ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది. ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు కూడా టూరిస్ట్‌లతో పాటు జర్నీ చేస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైతే ఎప్పుడైనా వారిని సంప్రదించొచ్చు.












Click it and Unblock the Notifications