తిరుపతి - శ్రీకాళహస్తికి వసతితో సహా : IRCTC స్పెషల్ ప్యాకేజీ, రూట్..!!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం IRCTC కొత్త ప్యాకేజీ ప్రకటించింది. నిత్యం తిరుపతికి వెళ్లే ప్రధాన రైళ్లలో కొత్త ప్యాకేజీ అమలు చేయనుంది. తిరుపతి - శ్రీకాళహస్తికి వెళ్లే భక్తుల కోసం ఈ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతిలో బస సౌకర్యం కల్పించనుంది. ఏసీతో పాటుగా స్లీపర్ కోచ్ ల్లోనూ ఈ ప్యాకేజీ అమలు కానుంది. గురు, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో ప్యాకేజీ అమలు కానున్నట్లు అధికారులు ప్రకటించారు.
తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తుల కోసం IRCTC కొత్త ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే నారాయణాద్రి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్, ఏసీ సీట్లు కేటాయిస్తోంది. తిరుపతిలో బస సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి, తిరుచానూరు, శ్రీకాళహస్తి దర్శించుకోవచ్చు. కాచిగూడ నుంచి ఈ రైలు ప్రారంభం కానుంది. స్లీపర్, 3AC కోచ్ ల్లో సదుపాయం కల్పించారు. 3 AC : ఒకరికి రూ.13810, డబల్ షేరింగ్ రూ.10720, త్రిపుల్ షేరింగ్ రూ.8940, 5-11సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.6480, వితౌట్ బెడ్ రూ.5420 గా నిర్ణయించారు.

అదే విధంగా స్లీపర్ క్లాస్ ఒకరికి రూ.12030, డబల్ షేరింగ్ రూ.8940, త్రిపుల్ షేరింగ్ రూ.7170, 5-11సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.4710, వితౌట్ బెడ్ రూ.3650. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8.05 గంటలకు రైలు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం తర్వాత తిరుపతి చేరుకుంటారు. ఎంచుకున్న ప్యాకేజీ ప్రకారం ఏసీ, నాన్ ఏసీ వాహనాల్లో తిరుచానూరు పద్మావతి ఆలయం, కాళహస్తి ఆలయం దర్శించుకుని తిరిగి హెటల్ కు చేరుకుంటారు. మూడో రోజు ఊదయం 2.30గంటలకు హోటల్ నుంచి బయల్దేరి తిరుమల తిరుపతి ఉచిత దర్శనం క్యూలైన్లలో వేచి ఉండాలి. దర్శనం తర్వాత సాయంత్రం తిరిగి హోటల్‌కు తీసుకువస్తారు. అక్కడి నుంచి 6.35నిమిషాలకు రైలు హైదరాబాద్ బయల్దేరుతుంది.
అదే విధంగా ఇదే ప్యాకేజీ నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు సైతం అందుబాటులో ఉంది. నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లింగంపల్లి స్టేషన్లో ప్రారంభమై సికింద్రాబాద్, బీబీనగర్, మిర్యాలగూడ, నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, గూడూరు జంక్షన్ మీదుగా తిరుపతి చేరుకుంటుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కాచిగూడ స్టేషన్లో ప్రారంభమై తెలంగాణలోని షాద్ నగర్, జడ్చర్లు, మహబూబ్ నగర్, గద్వాల మీదుగా ఏపీలోని కర్నూలు చేరుతుంది. డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications