రైలు టికెట్ ఇప్పుడు తీసుకో.. డబ్బులు తర్వాత చెల్లించు!
అత్యవసరంగా రైలులో ప్రయాణించాల్సి వచ్చింది.. చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాదు.. ఎవరిని అడగాలో అర్థం కాదు. ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC ఒక సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ముందుగా టికెట్ తీసుకొని టికెట్ కాస్ట్ కు అయ్యే డబ్బును తర్వాత చెల్లించవచ్చు.
ఈ సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పించేందుకు IRCTC క్యాష్‌ఈ, పేటీఎం, ఈపేలేటర్‌తో చేతులు కలిపింది. క్యాష్‌ఈ 'ట్రావెల్ నౌ పే లేటర్ (TNPL)' పేరుతో, పేటీఎం.. పోస్ట్‌పెయిడ్ కింద అందుబాటులో ఉంచాయి. వీటిని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.

పేటీఎం పోస్ట్‌పెయిడ్..
పేటీఎం తన వినియోగదారుల కోసం పోస్ట్‌పెయిడ్ సర్వీసులను తెచ్చింది. 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా పేటీఎం తమ యూజర్లకు రూ.60,000 వరకు రుణంగా ఇస్తోంది. బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. భారమనుకుంటే ఈఎంఐగా మార్చుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని ఐఆర్‌సీటీసీ (IRCTC)లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్ కావాలి.
★ బయలుదేరే ప్రాంతం, గమ్యస్థానం సహా ఇతర ప్రయాణ వివరాలు ఎంటర్ చేసి బుక్ టికెట్‌పై క్లిక్ చేయాలి.
★ పేమెంట్ సెక్షన్‌లో పే లేటర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను ఎంపిక చేసుకోవాలి.
★ పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేయడంతో టికెట్ ప్రక్రియ పూర్తవుతుంది.
క్యాష్‌ఈ ద్వారా ఇలా..
★ ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
★ ప్రయాణ వివరాలను నమోదు చేసి బుక్ టికెట్‌ఫై క్లిక్ చేయాలి.
★ డబ్బులు చెల్లించే ఆప్షన్లలో 'ట్రావెల్ నౌ పే లేటర్' (TNPL)ను ఎంచుకోవాలి.
★ టీఎన్‌పీఎల్ అందిస్తున్న వాటి నుంచి క్యాష్‌ఈని ఎంపిక చేసుకోవాలి.
★ టికెట్ ప్రక్రియ పూర్తవుతుంది. డబ్బును ఈఎంఐల కింద మూడు లేదా ఆరు నెలలు చెల్లించొచ్చు.
★ ఈపేలేటర్ అనే ఫిన్‌టెక్ సంస్థ సైతం ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాకపోతే 14 రోజుల్లోగా టికెట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించలేకపోతే 36 శాతం వడ్డీ విధిస్తారు.












Click it and Unblock the Notifications